ధనశక్తి రాజయోగం.. ఈ రాశులవారికి అఖండ ధనయోగం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు, రాశులలో వేరే గ్రహాలతో సంయోగం జరుగుతున్నప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా, కొన్ని అశుభ యోగాలు.
ధన శక్తి రాజయోగం
జ్యోతిష్య శాస్త్రంలో ధన శక్తి రాజయోగం అనేది శుక్రుడు మరియు కుజుడు సంయోగం చెందినప్పుడు ఏర్పడేటువంటి యోగం. ఈ యోగం కొన్ని రాశుల వారికి ధన ప్రయోజనాలను కలుగజేస్తుంది. 2025 మే నెలలో రాక్షసుల గురువైన శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు జూన్ 29వ తేదీ వరకు మేషరాశిలో ఉండి ఆ తరువాత వృషభ రాశిలో సంచారం చేస్తాడు.

ధన శక్తి రాజయోగం అదృష్ట రాశులు
జూన్ 29 వరకు శుక్రుడు అంగారకుడి రాశి అయిన మేషరాశిలో ఉంటాడు. ఇక అంగారకుడు సూర్యుడు పాలించే సింహరాశిలో ఉంటాడు. దీంతో ధన శక్తి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మిధున రాశి
మిధునరాశిలో శుక్రుడు 11వ ఇంట్లో, కుజుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల ధన శక్తి రాజయోగం కారణంగా మిధున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఏ పని చేసిన అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు. కుజుడు సూర్యుని రాశిలో మరియు శుక్రుడు కుజుడి రాశిలో ఉండడం వల్ల 12వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు లాభదాయక ఇంట్లో సంచరించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది.
మిధునరాశి వారికి శుభాలు
మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏ కోరిక కోరుకున్న నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. ఇది మిధునరాశి వారికి శుభాలను కలిగించే సమయం.
కర్కాటక రాశి
శుక్రుడు కుజుడు ఏర్పరచిన ధన శక్తి రాజయోగం తో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడు పదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల, కుజుడు రెండవ ఇంట్లో సంచరించడం వల్ల ధన శక్తి రాజయోగం కర్కాటక రాశి వారికి కొత్త మార్గాలను, నూతన ఆదాయ వనరులను అందిస్తుంది.
స్థిరంగా ఆర్థిక పరిస్థితి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
ధన శక్తి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశిలో శుక్రుడు 6వ ఇంట్లో, కుజుడు పదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల వీరు సానుకూలమైన ఫలితాలను చూస్తారు. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో శత్రువులను తెలివిగా ఎదుర్కోగలుగుతారు . పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఏ పని చేయడానికి అయినా ఈ సమయం మంచిది. సంపద పెరుగుతుంది. వివిధ రంగాలలో విజయం సాధించడానికి ఇది మంచి సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications