మనం చేసే చిన్న చిన్న తప్పులే వాస్తుదోషానికి కారణమని తెలుసా?
ప్రతి మనిషి కచ్చితంగా వాస్తును అనుసరిస్తాడు. ఎందుకంటే వాస్తు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా బాగుంటారు. ఎటువంటి సమస్యలు ఎదురుకావు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టవు. కుటుంబ సభ్యుల మధ్య కోపాలుండవు.. వాదనలు రావు. అందరూ ప్రశాంతంగా జీవించొచ్చు. అయితే ఇలా ఉండాలంటే వాస్తు దోషాలు ఉండకూడదు. అలా ఉండకుండా చేయాలంటే మనం చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండాలి. అవేమిటనేది తెలుసుకుందాం.
పగిలిన గాజు వస్తువులు ఉండకూడదు
గాజు వస్తువులు పగులితే వాటిని తీసేయాలి. ఇంట్లో ఉంటే రాహు దోషం ఉంటుంది. అడ్డంకులు ఎదురవుతాయి. కెరీర్ లో వృద్ధి ఉండదు. పగిలిన గాజు వస్తువులు ఉంచుకోవడం మహా పాపంగా పరిగణిస్తారు.

రోజూ దీపం వెలిగించాలి
లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మంగళవారం, శుక్రవారం దీపం వెలిగించి పూజ చేయాలి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులను బయటకు పంపి సంతోషంగా ఉండటానికి ఇది చాలా అవసరం అంటున్నారు నిపుణులు. రోజుకు ఒకసారైనా ఇంట్లో దీపం వెలిగిస్తుండాలి.
పొద్దున్నే నిద్ర లేవాలి
ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నిద్ర లేవాలి. ఆ సమయంలో స్నానం చేయాలి. దీనివల్ల సూర్యుడి నుంచి సానుకూల శక్తిని పొందుతాం. దీనికి విరుద్ధంగా సూర్యోదయం తర్వాత నిద్రలేవడంవల్ల కుటుంబంలో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. నష్టాలు సంభవిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.
వాటర్ లీకవుతుండటం
నీరు లీకవుతుంటే నివారించడానికి గ్లాసు నీటిలో నిమ్మరం, ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీరు లీకవుతుంటే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. శాస్త్రం ప్రకారం ఏమి చేసినా అది ఫెయిలవుతుంటుంది. నీటి పైపులు లీకవకుండా చూసుకోవాలి.
పాత చెప్పులు అక్కడ వద్దు
ప్రధాన తలుపు దగ్గర పాడైన చెప్పులు ఉండకూడదు. దీనివల్ల డబ్బు ఇంటికి దూరమవుతుంది. కష్టాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. బూట్లు కూడా ఉంచకూడదు. ఒక పక్కగా విడుచువాలి.












Click it and Unblock the Notifications