అధికంగా ఉప్పు తీసుకున్నారో ఇక అంతే ?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తప్పని సరి అయిపోయింది. ఉప్పు లేని ఆహారం తినాలంటే చాలా కష్టం. ఉప్పు అంటుందట అన్నేసి చూడు నన్నేసి చూడు అని. చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి.

ఉప్పు రుచి కొరకు తింటే మంచిదే అందుకని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య సూత్రం సూచిస్తుంది. వంటకాలలో పాత కాలం లాగ దొడ్డు ఉప్పు వాడడమే సంపూర్ణ ఆరోగ్య సూత్రం. అయోడిన్ ఉప్పు, ఎనర్జీ ఉప్పు అని నానా రకాల సన్న ఉప్పు మార్కెట్‌లో చాలా రకాల కంపనినీ పేర్లతో వచ్చాయి. అవి ఏమీ ఆరోగ్య కరమైనవి కాదు. కేవలం దొడ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యదాయిని. రుచి అని మరి ఎక్కువగా ఉప్పు తింటే కలిగే సమస్యలు ఓసారి తెలుసుకుందాం.

* ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటాం. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకుంటే.. సరిపోతుంది.

Disadvantages of taking more salt

* ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా సహించదు. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది.

* ఉప్పు అధిక మోతాదులో తీసుకునే వారి శరీరంలో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బుతుంది. అక్కడే వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది. అందుకు కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తినేవారిలోనే ఈ సమస్య వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి.

* ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో నీరు త్వరగా అయిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా ఈ సమస్య వేసవికాలంలోనే వస్తుంది. కనుక ఉప్పు తగ్గిస్తే మంచిది.

* పూర్వ కాలంలో దొడ్డుప్పు వాడారు ఏలాంటి బి.పి లు లేవు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రస్తుత కాలంలో అయోడిన్ ఉప్పు తింటే బి.పి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పాత కాలం లాగే రాక్ సాల్ట్ వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+