Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Diwali 2023: దీపావళి నాడు ఏ దిశలో ఏ రంగుల లైట్లు పెడితే శుభమో తెలుసా!!

హిందువులు అత్యంత ఇష్టంగా, పవిత్రంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి, దీపావళి పండుగను ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు వస్తుంది. దీపావళి పండుగ అంటే దీపకాంతుల వేడుక. ఆ రోజు అందరూ ఇల్లంతా దీపాలు వెలిగించి జీవితంలోకి వెలుగును ఆహ్వానిస్తారు, అయితే దీపావళి పండుగ సందర్భంగా దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు ఏ దిశలో పెట్టాలి అనే వాస్తు శాస్త్ర వివరాలు తెలుసుకోవాలి.

మీరు దీపావళికి మీ ఇంటిని దీప కాంతులతో నింపడానికి సిద్ధం చేస్తున్నారా.. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దిశలను పరిశీలించడం అసలు మరిచిపోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నూనె దీపాలతో పాటు అలంకరణ లైట్ల విషయానికి వస్తే మార్కెట్లో అనేక ఎంపికలు ఉన్నాయని, కాస్త వాస్తు దృష్టి తోటి వీటిని ఎంపిక చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Diwali 2023: Know which direction which color lights are auspicious on Diwali!!

దీపావళి నాడు రంగురంగుల ఫెయిరీ లైట్లు, బల్బులు, డిజైనర్ ల్యాంప్స్ మొదలైనవాటిని ఇంటి అలంకరణ కోసం ఎంచుకోవచ్చు. దీపావళి వాస్తు ప్రకారం వివిధ రంగుల లైట్లకు కొన్ని దిశలు అనుకూలంగా ఉంటాయని సూచిస్తున్నారు. దీపావళి పండుగ నాడు ఇంటిని అలంకరించేటప్పుడు తూర్పు దిశలో ఎరుపు, పసుపు, మరియు నారింజ వంటి రంగుల లైట్లు శుభసూచకంగా ఉంటాయని చెబుతున్నారు.

ఇక పశ్చిమ దిశలో పసుపు, నారింజ, మరియు గులాబిరంగు లైట్లతో అలంకరిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు.. నీలం, పసుపు మరియు ఆకుపచ్చ దీపాలను ఉత్తర దిశలో పెడితే ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక దక్షిణ దిశ వైపు లైట్ లు పెట్టడానికి తెలుపు, వైలెట్ మరియు ఎరుపు లైట్ లు పెడితే మంచిదని చెబుతున్నారు.

ఏది ఏమైనా దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేయడంలో, దీప కాంతులతో ఇంటిని కాంతివంతంగా మార్చడంలో చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే, జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరెందుకాలస్యం ఈ దీపావళికి వాస్తు జాగ్రత్తలతో దీపాలను పెట్టండి. రంగు రంగుల లైట్ల విషయంలో దిశలను పాటించండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+