ఈ రాశివారు గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దు?
ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి.
ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి 7వ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత 8వ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. కేతువు రెండవ స్థానమైన తులా రాశి నుంచి ఒకటవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

కన్యా రాశివారికి మిశ్రమ ఫలితాలు
ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఏప్రిల్ వరకూ గురు గోచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. గురువు దృష్టి 11వ ఇంటిపై, ఒకటవ , 3వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు, చేసిన ఆలోచనలు విజయవంతం అవటం వలన ఆర్థికంగా మీకు లాభిస్తుంది. శని గోచారం కూడా 6వ ఇంటిలో అనుకూలంగా ఉండటంతో వృత్తిపరంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తారు.

పెట్టుబడులు లాభాలనిస్తాయి
గతంలో మీరు దేనిలోనైనా పెట్టుబడులు పెట్టివుంటే అవి మంచి లాభాలను ఇస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం వాహనంకానీ, ఇల్లుకానీ, ఇతర స్థిరాస్తులుకానీ కొనుగోలు చేయాలనుకుంటే ఏప్రిల్ లోపు చేయడం మంచిది. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు. దీనివల్ల పెట్టుబడులు, కొనుగోళ్లుకానీ నష్టాలను ఇచ్చే అవకాశం ఉంది. రాహు గోచారం నవంబరు వరకు 8వ ఇంటిలో ఉండటంతో తొందరపడి, లేదంటే ఇతరులు చెప్పిన మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు.

ఆర్థిక పరిస్థితిని గమనించుకోవాలి
సంవత్సరమంతా శని గోచారం బాగుండటం వలన మీకు ఆర్థికంగా ఎక్కువ సమస్యలు ఎదురుకావు. ఏప్రిల్ నుంచి గురువు, రాహువు ఎనిమిదవ ఇంటిలో సంచరించడం వలన ఒక్కోసారి డబ్బుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితిని సరిగా గమనించుకోకుంటే ర్థిక నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. తర్వాత గురు దృష్టి 12వ ఇంటిపై, రెండవ ఇంటిపై మరియు నాలుగో ఇంటిపై ఉండటం వలన మీరు మీ కుటుంబం కొరకు, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మరియు ఇండ్లు, వాహనాలు తదితర గృహోపకరణాల మరమ్మతులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దు
8వ ఇంటిలో రాహువు గోచారం ఉన్నంతకాలం మీరు గొప్పలకు పోకుండా, డబ్బులు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నవంబరులో రాహువు గోచారం 7వ ఇంటికి మారడటంతో కొంతవరకు ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు, ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17 వరకు, డిసెంబరు 16 నుంచి సంవత్సరాంతం వరకు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకున్నదానికన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంవల్ల ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications