ఇంటికి సరిగా వాస్తు ఉందా? లేదా? ఇలా చూసుకోండి!
ఇల్లు నిర్మించే సమయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా వాస్తు శాస్త్ర ప్రకారమే నిర్మిస్తారు. ఎన్ని స్తంభాలుండాలి? మెట్లు ఎక్కడ ఉండాలి? కిటికీలు ఎక్కడ ఉండాలి? తదితర విషయాలన్నింటికీ ఒక ప్రణాళిక గీస్తారు. దాని ప్రకారం ఇంటిని కడతారు. అదృష్టం కలిసివచ్చు సానుకూల శక్తి ప్రసరించాలంటే మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి. ప్రధాన ద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు.
ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశల్లో ప్రధాన ద్వారం ఉండాలి.
చెట్లు, సంభాల్లాంటివి ప్రధాన ద్వారానికి అడ్డుగా ఉండకూడదు.
ప్రధాన ద్వారం వద్ద చెప్పులు విడవకూడదు.
ప్రధాన ద్వారం లోపలివైపు చిన్నగంటలు వేలాడదీస్తే సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

ఈశాన్యంలో పూజ గది ఉండాలి.
ఈ వైపు దేవతలుంటారు.
తూర్పు వైపు తిరిగి పూజ చేయాలి.
ఆగ్నేయంలో వంటగది ఉండాలి
తూర్పు లేదంటే ఉత్తరం వైపు వంట చేయడ ఉత్తమం.
స్టవ్, సింక్ పక్కపక్కనే ఉండకూడదు.
నైరుతి దిశలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉండాలి.
తల దక్షిణం లేదా పడమర వైపు పెట్టి నిద్రపోవాలి.
అద్దం ఉంటే రాత్రి వేళ గుడ్డతో కప్పాలి.
గోడలకు లైట్ రంగులు వేయాలి.
మానసికంగా ప్రశాంతతోపాటు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఇంటి పరిసరాల్లో ముళ్ల మొక్కలు ఉండకూడదు.
నీరు లీకవకూడదు. రిపేరు చేయించాలి. దీనివల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
పనికిరాని వస్తువులు, పగిలిపోయిన వస్తువులు తీసేయాలి. చెత్త, చెదారం ఉండకూడదు.
మెట్లు క్లాక్ వైజ్ గా పైకి వెళ్లాలి. సరిసంఖ్యలో ఉండకూడదు.
దోషాలుంటే నిపుణులను సంప్రదించాలి. వారు చెప్పినది అనుసరించాలి.
తులసి మొక్కను ఈశాన్యంలో ఉంచాలి. దీనివల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
ఆగ్నేయంలో అక్వేరియం ఉంటే ఆర్థికంగా మంచిది. కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications