వాస్తులో లోపాలున్నాయని ఇంట్లో మార్పులు వద్దు..ఆయన్ని నమ్ముకోండి!

వాస్తులో లోపాలున్నాయని, ఇంట్లో గోడను పగలగొట్టాలని, కిటికీలను మార్చాలని, వాటిని మరో దిశలో పెట్టాలని, మరోచోటకు బాత్ రూం మార్చాలని... ఇలా ఎందరెందరో.. ఏదేదో చెబుతుంటారు. వాస్తు ఒక పురాతన శాస్త్రం. దాన్ని మన సాంప్రదాయం ప్రకారం కట్టడాలు నిర్మించే సమయంలో పాటిస్తుంటాం. అందులో తప్పులేదు. కట్టే సమయంలోనే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ముగ్గురు, నలుగురు వాస్తు నిపుణులను కలిసి నిర్మాణం చేసుకోవాలి. తీరా గృహ ప్రవేశం చేసిన తర్వాత ఇబ్బందులు వచ్చాయని, వాస్తులో లోపం ఉందంటూ ఎవరో చెప్పే మాటను చెవిలో వేసుకుంటారు.

మనసులో గిలి పడుతుంది
అప్పటినుంచి మనసులో గిలి పడుతుంది. జీవితం అన్న తర్వాత మనిషికి కష్టాలు వస్తాయి.. సుఖాలు వస్తాయి. కష్టాలు వస్తే వాస్తు లోపం అనుకుంటే అంతకంటే తెలివితక్కువ తనం ఉండదు. ఒక్కోరోజు ఒక్కో వాస్తు నిపుణుడిని తీసుకొచ్చి చూపిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. వారు చెప్పినట్లుగా మార్చుకుంటూ వెళితే ఇంటికైనా, కార్యాలయానికైనా.. ఇలా దేనికైనా సరే వచ్చిన రూపం మాయమవుతుంది. అలా కాకుండా వాస్తులో లోపాలున్నాయని, కలిసిరావడంలేదని ఎందరు చెప్పినా మీకు అత్యంత బలమైన విశ్వాసం ఉంటే సద్గురువును నమ్ముకోండి. లేదంటే మీ గురువును నమ్ముకోండి.

Dont make changes to your house because of architectural flaws Trust a spiritual master

చిటికెలో పరిష్కరిస్తారు
చిటికెలో వాటిని పరిష్కరించేస్తాడు. కానీ అది తొందరగా సాధ్యపడదు. మీకు గురువుపై నమ్మకం ఉండాలి. విశ్వాసం బలంగా ఉండాలి. షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజ్, రమణ మహర్షి, మంత్రాలయ రాఘవేంద్రస్వామి, గొలగమూడి వెంకయ్యస్వామి, తాజుద్దీన్ బాబా, ఎక్కిరాల భరద్వాజ మాస్తారు... ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతీయ సమాజంలో ఎందరో సద్గురువులు, గురువులు ఇప్పుడు శరీరంతో లేకపోయినప్పటికీ తమ మహిమలద్వారా భక్తులకు చేయూతనందిస్తూనే ఉన్నారు.

మీ కష్టాలు చెప్పండి
వారికి మీ కష్టాలు తెలుపుకోండి. వారితో మాట్లాడండి. దేవాలయంలో పూజారితో మాట్లాడి వారిని ఏవిధంగా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకొని ఆ ప్రకారం చేయండి. కచ్చితంగా మేలు కలుగుతుంది. అంతేకానీ వారు, వీరు చెప్పారంటూ లక్షణంగా ఉన్న ఇంట్లో పదే పదే మార్పులు చేయొద్దు. సద్గురువు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని తెలుసుకోండి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది. అయితే కొన్ని కొన్ని కర్మలు, వాటి ఫలితాలను మాత్రం అనుభవించాలనేది తప్పనిసరి అని తెలుసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+