ఫిబ్రవరిలోగా ఈ రాశుల తలరాతను మారుస్తున్న బృహస్పతి
ఐశ్వర్యానికి, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలకు, సంపద, కీర్తికి కారకుడైన బృహస్పతి తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటాడు. ప్రస్తుతం వృషభరాశిలో తిరోగమన దిశలో ఉన్న గురుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగోతేదీన మిథునరాశిలోకి సంచరిస్తాడు. ఏడాదికోసారి గురుడు తన రాశిని మార్చుకుంటాడు. దీనివల్ల రాశిచక్ర గుర్తులపై ప్రభావం పడుతుంది. తిరోగమనంలో ఉన్న బృహస్పతి వల్ల ఏ రాశులకు కలిసి వస్తుంది? ఏ రాశులకు అశుభ ఫలితాలు కలుగతాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. గతంలోకంటే ఇప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్నిరకాల పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం బాగా కలిసివస్తుంది.

వృశ్చిక రాశి
వృత్తిపరంగా, ఉద్యోగంలో, వ్యాపార పరంగా.. అన్నిరకాలుగా లాభాలున్నాయి. మంచిపేరు వస్తుంది. పెండింగ్ పనులన్నింటినీ ప్రారంభించి విజయం సాధిస్తారు. అందుకు అదృష్టం కలిసివస్తుంది. శుభవార్తలను అందుకోవడంతోపాటు పిల్లల నుంచి లాభదాయకమైన విషయాలను వింటారు.
మేష రాశి
బృహస్పతి తిరోగమనం వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందుబాటులోకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు తగ్గిపోతాయి.
కన్యా రాశి
ఆర్థికంగా మంచి స్థితికి ఈ రాశివారు చేరుకుంటారు. అనుకున్న సమయంలో డబ్బుచేతికి అందడంతోపాటు వాటిని పొదుపు చేస్తారు. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం. గురుడి తిరోగమనం వీరికి ఇంకా అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది.
మకర రాశి
ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. పెండింగ్ పనులు ప్రారంభిస్తారు.కుంభరాశి, తులారాశి, మిథునరాశివారికి మాత్రం గురుడి తిరోగమనం అశుభ ఫలితాలను కలిగిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడం మానుకోవాలి.












Click it and Unblock the Notifications