ఈ రాశుల కష్టానికి తగిన గుర్తింపు.. కొత్త ఇంటిని బహుబతిగా ఇవ్వనున్న కుజుడు, శని
గ్రహాల కదలికలు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలతోపాటు సామూహిక జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. ధైర్యానికి, శక్తికి కారకుడైన కుజుడు ఈనెల 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు ఆ రాశిలోని ఎనిమిదో స్థానంలో శని, ఆరో స్థానంలో కుజుడు ఉంటారు. దీనివల్ల కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ రెండు గ్రహాల వల్ల అదృష్టం పొందే రాశుల వివరాలను తెలుసుకుందాం.
మేషం
కొత్తగా వాహనాన్ని లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. వివాహం కానివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోట సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి
శత్రువుల నుంచి విముక్తి లభించి సంతోషంగా ఉంటారు. గట్టి పోటీల్లో విజయం సాధిస్తారు. మీ ఆలోచనలకు అనుగుణగా పెట్టుబడి పెట్టడానికి ఇతరులు ముందుకు వస్తారు. రాదనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి రుణాన్ని చెల్లిస్తాడు. ఈ సమయంలో సంపాదన పెంచుకోవడానికి మంచి వ్యూహాన్ని అమలు చేస్తే విజయం లభించడంతోపాటు లాభదాయకంగా పనులు సాగుతాయి.
కన్యా రాశి
వృత్తి జీవితంలో ఉన్నవారికి గొప్ప పురోగతి లభిస్తుంది. పనిచేసేచోట తోటి ఉద్యోగులు బాగా సహకరిస్తారు. విదేశాల్లో విద్యనభ్యసించాలని కలలు కంటున్నవారి కోరికలు నెరవేరతాయి. ఉత్సాహంతో, గొప్ప ప్రేరణతో ఉండి తెలివితేటలను పెంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. దీనివల్ల జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సులువుగా జరుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications