అద్దె ఇల్లు కూడా వాస్తు ప్రకారం ఉండాలి.. ఇలా చూడండి!

మానవులు, దేవతలు నివసించే స్థలాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. ఈరోజుల్లో అందరికీ సొంతిల్లు ఉండదు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చినప్పుడు అద్దె ఇళ్లే శరణ్యం. సొంత ఇల్లు అయితే వాస్తు చూసుకుంటాం. మరి అద్దె ఇల్లు అయితే వాస్తు ఎలా చూడాలి అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది.

అద్దెకు ఇల్లు తీసుకున్నా వాస్తును పరిశీలించాల్సిందే. ఎందుకంటే ఇంట్లో ఉండేవారి జీవితాన్ని వాస్తు ప్రభావితం చేస్తుంది. వాస్తు దోషాలున్నాయంటూ తరుచుగా చాలామంది తాముంటున్న ఇళ్లను ఖాళీ చేస్తుంటారు. అద్దె ఇంటికోసం ఏయే నియమాలుండాలనేది తెలుసుకుందాం.

Even a rented house should be according to Vastu Look at this

అద్దెకు చూసిన ఇంట్లో గతంలో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలి. మానిసకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఏదన్నా చెడు జరిగితే గణపతి హోమం, వాస్తు శాంతి చేయించుకోవాలి. వంట గది, పూజా గది దక్షిణంవైపు లేకుండా చూసుకోవాలి.

స్మశానాల దగ్గర, దేవాలయాల దగ్గర, పవర్ ప్లాంట్ల దగ్గర, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇంటిని తీసుకుంటే మనశ్శాంతి ఉండదు. ప్రశాంతంగా వాతావరణం ఉన్నచోట ఇంటిని అద్దెకు తీసుకోవాలి.

గాలి, వెలుతురు బాగా వచ్చే ఇళ్లను అద్దెకు తీసుకోవాలి. దీనివల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు, స్తంభం లేదంటే భారీ అడ్డంకులు ఉండకూడదు. సింహద్వారాం ఉత్తరం లేదంటే తూర్పు వైపు ఉంటే లక్ష్మీయోగం కలుగుతుంది.

మొబైల్ టవర్స్, విద్యుత్తు స్తంభాలున్నచోట తప్పనిసరిగా ఉండాల్సి వస్తే నవగ్రహ పూజ, గణేశుడి పూజ చేయించుకుంటే ప్రతికూల శక్తులు పారిపోతాయి.

నైరుతిలో ఇంటి యాజమాని బెడ్ రూం, వంటగది, ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి. పడమరవైపు కూడా దేవుడి గది ఉండొచ్చు. తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. తలుపులు లోపలికి తెరిచేలా ఉండాలి. తలుపులు సరైన దిశలో తెరుచుకునేలా చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని అద్దెకు దిగితే లక్ష్మీదేవి అనుగ్రహానికి కొదవే ఉండదు. మంచి ఆరోగ్యం చేకూరుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+