ఈ రాశులవారికి మరికొంతకాలం ఆర్ధిక నష్టాలు.. జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశులవారి జీవితాలు ప్రభావితమవుతాయి. జూలై మాసంలో 28వ తేదీన కుజుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. అయితే కుజ గ్రహం శని గ్రహానికి 180 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఎంతో శక్తివంతమైన సంసప్తక యోగం ఏర్పడింది. మీన రాశిలో శని దేవుడు తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు.
సంసప్తక యోగం కారణంగా ఇబ్బందులు పడే రాశులు
ఇక ప్రస్తుతం కన్యారాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడిన ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం సంసప్తక యోగం కారణంగా ఇబ్బందులు పడే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి సంసప్తక యోగం కొంతమేర ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తత అవసరం. అవసరానికి తగినట్టు ఖర్చులు పెట్టడం మంచిది. అనవసరపు ఖర్చుల నుండి మేషరాశి వారు దూరంగా ఉండాలి.
మిధున రాశి
సంసప్తక యోగం కారణంగా మిధున రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరి వైవాహిక జీవిత పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్య జీవితంలో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత తగ్గి పలు రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మిధున రాశి వారికి ఇది కాస్త ఇబ్బందులు కలిగించే కాలం.
కర్కాటక రాశి
సంసప్తక యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు సమస్యలు వస్తాయి. ఈ సమయంలో వీరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కర్కాటక రాశి జాతకులు డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి సమస్యలు తెచ్చిపెట్టే కాలం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications