వాస్తు ప్రకారం ఇంట్లో ఏ గదికి ఏ రంగు ఉండాలో తెలుసుకోండి
వాస్తు శాస్త్రాన్ని అందరూ తేలిగ్గా తీసేస్తారు. అయితే వాస్తును సరిగా అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు కుటుంబంలో ఎదురు కావని, అంతేకాకుండా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఇంటికి ఏ రంగు ఉండాలనేది కూడా వాస్తును బట్టి ఉంటుందనే విషయం చాలమందికి తెలియదు. పూజగది, బెడ్ రూం, బాత్ రూం, హాలు, కిచెన్, స్టోర్ రూంలాంటివన్నింటికీ వాస్తు ప్రకారం కొన్ని రంగులు ఉంటాయి. ఆ రంగులను ఆ గదులకు వేస్తే అన్నీ కలిసివస్తాయి. వాస్తు ప్రకారం రంగులనేవి ఇంటికి అందాన్నివ్వడమే కాకుండా సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయి. ఏ గదికి ఏ రంగు ఉండాలనేది మనం తెలుసుకుందాం.
లేత రంగులు సానుకూల శక్తితో నిండి ఉంటాయి.
మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.
లివింగ్ రూమ్ కు లేత పసుపు రంగు లేదంటే క్రీమ్ రంగు వేయాలి.

పడక గదికి లేత గులాబీ రంగు వేయాలి.
లావెండర్ రంగు కూడా వేయొచ్చు.
దాంపత్య జీవితం మధురంగా సాగాలంటే ఈ రంగులు వేయాలి.
మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
పిల్లల గదికి లేత ఆకుపచ్చ లేదంటే ఆకాశం నీలం రంగు
లేత రంగులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
వంటగదిలో లేత పసుపు రంగు లేదంటే నారింజ రంగు వేయాలి.
ఈ రంగులు మనిషిలో ఆకలిని పెంచుతాయి.
కుటుంబంలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాయి.
పూజగదికి తెలుపు రంగు లేదంటే పసుపు రంగు వేయాలి.
ఈ రెండు రంగులు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి.
ధాన్యం చేసుకోవడానికి ఈ రెండు రంగులు ఎంతో ప్రయోజనకరం.
చదువుకునే గదికి ఆకుపచ్చ రంగు లేదంటే లేత గోధుమ రంగు ఉండాలి.
ఆకుపచ్చ రంగు పిల్లల్లో ఏకాగ్రత , స్థిరత్వాన్ని అలాగే ఉంచుతుంది.
బాత్రూమ్ లో నీలం, ఆకుపచ్చ రంగులు వేయాలి.
ఇవి ఎప్పుడూ పరిశుభ్రతను, తాజాదనాన్ని సూచిస్తాయి.
మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి.












Click it and Unblock the Notifications