ఈ రాశుల దశ, దిశ ఈనెల 19 నుంచే మారింది... అష్టైశ్వర్యాలన్నీ వీరికే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసినప్పుడు కొన్ని రాశులవారికి సానుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలా కాకుండా రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగాకానీ, సమీపంగాకానీ వచ్చినప్పుడు గ్రహాల సంయోగం అంటారు. నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు, శనిదేవుడు ఈనెల 19వ తేదీన సంయోగం చెందారు. రెండూ సున్నా డిగ్రీలో ఉన్నాయి. ఈ ప్రభావం ఐదు రాశులకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
వ్యాపారాలతోపాటు వృత్తిలో కూడా విజయం సాధిస్తారు. ఇంటిని లేదంటే భూమిని లేదంటే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. చిన్న చిన్న అపోహలన్నీ తొలగిపోతాయి. సంతోషం వెల్లివిరుస్తుంది.

five zodiac signs already getting so many benefits and money due to venus and saturn conjunction

కుంభ రాశి
కార్యాలయంలో ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. ఆదాయం పెరగడంవల్ల వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది.

మీనరాశి
విద్యకు సంబంధించిన పనుల్లో విజయాలను అందుకుంటారు. స్నేహితులతో కలిసి సత్సంబంధాలను ఏర్పరుచుకోవడంతోపాటు ఎక్కువమందితో కమ్యూనికేషన్స్ కలిగివుంటారు. భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి
ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ పనిని పూర్తిచేయడంతోపాటు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో కొత్త పనిని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా విజయాన్ని అందుకుంటారు.

తులారాశి
ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారు, సృజనాత్మకత రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. వ్యాపారం పెరగడంతోపాటు గతంలో ఇచ్చి నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక పరమైన పనులపట్ల ఆసక్తిని పెంచుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+