అదృష్టం ఈ రాశులవైపే తిరుగుతోంది... ఆకస్మిక ధనలాభం
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు ఈ సంవత్సరంలో జరిపే రాశి సంచారం వల్ల కొన్ని రాశిచక్ర గుర్తులు బాగా లాభపడుతున్నాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటుంది. ఇలా సంచారం చేసే క్రమంలో మంచి ప్రయోజనాలతోపాటు నష్టాలను కూడా కలిగిస్తుంటాయి. కుజుడు 2025లో సంచారం చేయడంవల్ల కొన్ని రాశులవారికి న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారంతోపాటు పనుల్లో జాప్యం కాకుండా త్వరగా పూర్తవుతాయి. ఏయే రాశులకు కుజుడివల్ల మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
కుజుడు సొంతరాశిలోకి ప్రవేశించడంవల్ల ఈ రాశివారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కొన్నాళ్ల నుంచి ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. అనుకున్నరీతిలో ఆదాయాన్ని కోరుకోగా అంతకుమించి డబ్బులు చేతికి వస్తాయి. వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది.

సింహరాశి
వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల ఊహించనిరీతిలో లాభాలు కలుగుతాయి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. పెద్దమొత్తంలో లావాదేవీలు జరుపుతారు.
వృశ్చిక రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంది. ఆస్తుల్లో వాటాలు వస్తాయి. భార్యవైపు, తండ్రివైపు నుంచి కలిసివస్తుంది. లాటరీలు గెలుచుకునే అవకాశం కనపడుతోంది. కొన్నాళ్లుగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
మకర రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. విదేశాల్లో అవకాశం వస్తుంది. అక్కడి నుంచి ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. భూమి అమ్మకాల్లో డబ్బులు చేతికి వస్తాయి. సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది.
ధనస్సు రాశి
అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్థులకు బాగుంది. ఆర్థిక లాభాలున్నాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి అమ్మకాలు, కొనుగోళ్లు వల్ల మంచి లాభాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది.












Click it and Unblock the Notifications