తులారాశిలో కుజుడు... ఈ రాశులపై కనక వర్షం
నవగ్రహాల్లో కీలక గ్రహమైన అంగారకుడు గ్రహాలకు కమాండర్ లాంటివాడు. ఈనెల 13వ తేదీన కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది శుక్రుడి సొంత రాశి. ఈ ప్రభావం మొత్తం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ ఐదు రాశులకు మాత్రం బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏయే రాశులకు ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
తులా రాశి
కుజుడి ప్రభావంతో ఈ రాశివారు చాలా శక్తివంతంగా మారతారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. నిర్ణయాలు చాలా అద్భుతంగా తీసుకుంటారు. అవన్నీ విజయవంతమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

ధనస్సు రాశి
కోర్టుకు సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
మకర రాశి
ఆత్మవిశ్వాసంతో పనులు చేయడంవల్ల అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకుంటారు. కోరికలన్నీ నెరవేరడంతోపాటు చేసే పనులన్నీ పూర్తవుతాయి. ఈ రాశివారి నాలుగో స్థానం నుంచి కుజుడు సంచారం చేస్తాడు.
మేష రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. శుభాకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగవుతారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. ఈ రాశి నుంచి కుజుడు ఏడో స్థానంలో సంచారం చేస్తాడు. భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా చూసుకోవాలి.
మిథున రాశి
పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. గురువు వల్ల మంచి లాభాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్తగా ఏర్పడే పరిచయాల నుంచి అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఈ రాశివారి ఐదో స్థానంలో కుజుడు సంచారం చేస్తాడు.












Click it and Unblock the Notifications