ఆగస్ట్ 20 నుండి మూడునెలలు వీరికి డబ్బుల మూటలను మోసుకొచ్చే బృహస్పతి!

బృహస్పతి గ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతిని దేవగురువుగా పిలుస్తారు. బృహస్పతి ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి లోనే సంచరిస్తున్నాడు. కానీ బృహస్పతి నక్షత్రాన్ని ఆగస్టు 20వ తేదీన రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది.

మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి
దేవగురువు బృహస్పతి ఆగస్ట్ 20న మృగశిర నక్ష్త్రంలోకి ప్రవేశించి నవంబర్ 28 2024 వరకు మృగశిర నక్షత్రంలోనే కొనసాగుతాడు. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అయితే బృహస్పతి సంచారం ఏ రాశి వారికి శుభాలను చేకూరుస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

For three months from August 20 Jupiter brings bundles of money to these zodiac signs

మేష రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి లబ్ది చేకూరుతుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మేష రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలలో లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయమని చెప్పొచ్చు.

మిధునరాశి
మిధున రాశి వారికి బృహస్పతి కటాక్షం లబ్ధి చేకూరుస్తుంది. మిధునరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది.ఈ సమయంలో కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగివస్తుంది. పాత పెట్టబడలు మిధున రాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లబ్ధిని పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో బలంగా ఉంటారు.

సింహరాశి
సింహరాశి వారికి బృహస్పతి మేలు చేస్తాడు. మూడు నెలల కాలం బృహస్పతి దయ సింహరాశి వారిపై ఉంటుంది. ఆర్ధికంగా లాభాలు వచ్చే సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.ఉద్యోగంలో మార్పు సంభవించవచ్చు . ఎగుమతి-దిగుమతుల వ్యాపారంలో గణనీయమైన లాభాలు వస్తాయి. మీరు మీ తల్లి నుండి మద్దతు పొందుతారు. వాహన సౌఖ్యం కలుగుతుంది. అధికారుల అండ దండలు ఉద్యోగాలు చేసేవారికి ఉంటాయి.

కన్యారాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కన్యా రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలను వింటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తులు ద్వారా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ పని చేసినా మంచే జరుగుతుంది.

ధనుస్సు రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+