బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం

మీన రాశిలో బుధుడి కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. సూర్యుడు ఈనెల 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం ఎంతో శుభప్రదమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా ఉన్నప్పటికీ కొందరి జాతకస్తులకు మాత్రం ఊహించని విధంగా మంచి జరగనుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలను కలగజేసే ఈ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కర్కాటక రాశి
మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. పనితీరు పరంగా వచ్చిన పేరును నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గతం నుంచి వెంటాడుతున్న డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

foru zodiac signs are going to get unexpected jackpot due to budhaditya raja yoga

కన్యా రాశి
వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. ఆర్థికంగా లాభాలున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పనిలోను సులువుగా విజయం సాధిస్తారు. విద్యార్థులకు విదేశాల్లో విద్యనార్జించాలనే కోరిక నెరవేరడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. బుధాదిత్య యోగం కారణంగా కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సమయంలోనే ఆస్తులు కూడా పెరుగుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడటంవల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+