బృహస్పతి దయతో మహర్జాతకులయ్యే రాశులు వీరే... డబ్బే డబ్బు!
దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపేలా చేసి జీవిత లక్ష్యాన్ని చేరుకునేలా సహాయ సహకారాలందిస్తాడు. ఆయన ఆశీస్సులుంటే ఏ గ్రహాలతోను పనిలేదు. గురువు కరుణా కటాక్ష వీక్షణాలతో మన జీవితాన్ని నందనవనంగా మార్చుకోవచ్చు. సంపద, శ్రేయస్సు, అదృష్టం, పిల్లలు, వివాహం, ఆనందానికి కారకుడు. పరమేశ్వరుడి కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసి దేవ గురువుగా బృహస్పతి మారారు. ఆయన అనుగ్రహం వల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఏ పని తలపెట్టినా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. జీవితకాలంలో సుఖసంతోషాలన్నీ మీవెంటే ఉంటాయి. అదృష్టం తోడు ఉండటంవల్ల పనులన్నీ పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

మీనరాశి
అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి. జీవితంలో గురువు దయవల్ల విశేషమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతిని పూజించాలి.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి బృహస్పతి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. కష్టపడి పనిచేసి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. కష్టపడి పనిచేయడంవల్ల గురువు అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు. ఏ పనిలోనైనా సులువుగా విజయాన్ని అందుకుంటారు.
సింహరాశి
ఈ రాశివారికి పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఎటువంటి పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. అందరితో ఎంతో స్నేహంగా మెలుగుతారు. అవసరమైనమేర సహాయం చేస్తారు. నలుగురికి మేలు గురించే ఆలోచిస్తారు. అందుకే వీరిని గురువు ఇష్టపడతాడు.












Click it and Unblock the Notifications