2026లో లక్కు కలిసొచ్చే రాశులు ఇవే.. కోట్ల ఆస్తి కలిసొస్తుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూతన ఆంగ్ల సంవత్సరం వస్తుండగానే తమకు బాగా కలిసివస్తుందేమోనని రాశిచక్ర గుర్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాయి. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి ఉగాదికి కొత్త సంవత్సరం. అయితే ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాగానే ఆరోజు నుంచి తమకు అదృష్టం కలిసివస్తుందనే ఆశతో ఉంటారు. 2026లో ఏయే రాశులకు గ్రహాల సంచారం అనేది ఏరకమైన ప్రయోజనాలను కల్పించనుందనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే అదే సంవత్సరంలో శుక్రుడి ప్రత్యేక సంయోగంతో శుక్రాధిత్య రాజయోగం ఏర్పడనుంది. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి ఏ రాశులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభ రాశి
ఈ రాశివారికి అదృష్టం ఉంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో ఇది మంచి రాబడిని అందిస్తుంది. అలాగే కొత్తగా ఇంటిని నిర్మించే అవకాశం కనపడుతోంది. శుక్రుడి వల్ల మంచి లాభాలను అందుకోబోతున్నారు.

ధనస్సు రాశి
వ్యాపారంలో ముందుకు పయనిస్తారు. అన్నీ మంచి శకునాలే ఉన్నాయి. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. బయట కూడా చాలా సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. కోర్టుల్లో తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. వివాదాలన్నీ సమసిపోతాయి.
మీన రాశి
కొత్త సంవత్సరంలో వీరు ఊహించనిరీతిలో లాభాలు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి ఆదాయం వస్తుంది. ఈ రాశివారు కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా చేసిన ప్రతి పని నుంచి అద్భుత రీతిలో ప్రయోజనాలను అందుకుంటారు. పెట్టుబడులు పెడితే కలిసివస్తుంది.
మేష రాశి
కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. కొత్త కొత్త అవకాశాలను అందుకుంటారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది.. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒకరకంగా కుటుంబంలో సంపద వెల్లివిరుస్తందని చెప్పొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తిప్రతిష్టలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications