ఈ రాశులు కిందపడ్డా వెంటనే పైకి లేస్తారు.. సంపద సృష్టిస్తారు
ఖగోళంలో నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశి చక్ర గుర్తులకు మంచి ఫలితాలను కలిగిస్తే, మరికొన్ని రాశిచక్ర గుర్తులకు వారు చేసుకున్న కర్మల ప్రకారం ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని రాశిచక్ర గుర్తులు ఓటములు ఎదురైనప్పటికీ ఎప్పటికీ కుంగిపోారు.
వీరి రక్తంలో భయం అనేదే ఉండదు. రాశుల ప్రకారం వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడమే కాకుండా వారి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. కొందరు కిందపడితే పైకి లేవలేరు. కానీ మరికొన్ని రాశులు మాత్రం కిందపడ్డా వెంటనే పైకి లేచి జీవితంలో ముందుకు సాగుతారు. అలా సాగే రాశుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం.

సింహ రాశి
వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగివుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి సత్ఫలితాలను ఇస్తాయి. వీరి జీవితం ఎదుటివారికి ఆదర్శనీయంగా ఉంటుంది. ఓటములు ఎదురైనప్పటికీ వీరు ఏరోజు కూడా కుంగిపోరు. పట్టుదలగా పనిచేసి విజయాలను అందుకుంటారు.
మేష రాశి
వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు దూసుకువెళతారు. వీరు సాధారణంగా కింద పడరు. ఒకవేళ కిందపడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం వీరి సొంతం. ఎదుటివారు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తారు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.
మకర రాశి
కష్టపడటం అనేదాన్ని వీరు ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగివుంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పనిని చేయాలని తపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తిచేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనస్తత్వం వీరికి లేదు. ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. భయం అనేపదానికి వీరికి అర్థం తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం గెలుపొందుతారు.
కర్కాటక రాశి
ఓటమి ఎదురైనా తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారతారు. కింద పడినా పైకి లేస్తారు. పనిని చాలా ఇష్టంగా చేస్తారు. ఎదుటివారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు.












Click it and Unblock the Notifications