శివరాత్రి రోజు శివయోగం.. ఈ రాశులపై కనక వర్షం

మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. చంద్రుడు, శని, సూర్యుడు రాశుల్లో సంచరిస్తున్నాయి. అలాగే జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వివాహం కూడా జరుగుతుంది. ఇటువంటి పవిత్రమైన రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. శక్తివంతమైన సిద్ధయోగం శివయోగంతోపాటు గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది. దీనివల్ల ఆయా రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.

మిథున రాశి
శివయోగం వల్ల ఉద్యోగస్తులకు మంచి లాభాలున్నాయి. ఊహించని రీతిలో సంపదను పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. గొప్ప వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. వారి గొప్పతనాన్ని గుర్తించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.

four zodiac signs are very lucky due to Shiv Yoga 2024

కన్యా రాశి
శివయోగం ఈ రాశివారి అన్ని కష్టాలను తొలగిస్తుంది. ఈ సమయంలో వారు ఎటువంటి పనులు చేసినా సులభంగా విజయం సాధిస్తారు. ఇతరుల నుంచి డబ్బును పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

కుంభ రాశి
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఇది బాగా కలిసివచ్చే సమయం. పెట్టుబడులు పెట్టేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అయితే వాటిని నిలబెట్టుకునేలా మీ పనితీరును మార్చుకుంటూ వెళ్లాలి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారికి ఇది మంచి అనువైన సమయం.. సద్వినియోగం చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+