తనకు ఇష్టమైన రాశులను కోటీశ్వరులుగా చేస్తున్న శనిదేవుడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రాశులుంటాయి. వారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వారి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే తిరుగుండదని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఏలినాటి శని ప్రభావం అనుభవించాలి. శారీరకంగా, మానసికంగా ఇక్కట్లకు గురవుతారు. వీటితోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అందించే న్యాయదేవుడైన శనివల్ల లాభపడే రాశుల వివరాలు, ఆయనకు ఇష్టమైన రాశులను తెలుసుకుందాం.
తులారాశి
ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తారు. దీనివల్ల వీరు అపారమైన లాభాలను, ప్రయోజనాలను పొందుతారు. శనిదేవుడి ప్రభావంవల్ల తులారాశివారు అంతులేని ధనం పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడు. ఆయన అనుగ్రహంతో డబ్బులు వచ్చేలా శనిదేవుడు చూస్తాడు.

కుంభరాశి
కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఎదుటివారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
శనిదేవుడికి ఈ రాశి అంటే ఎంతో ఇష్టం. మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి వీరు బయటపడేలా చేస్తాడు. శనిదేవుడి అనుగ్రహం వల్ల వీరు అనేకరకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
వృషభరాశి
వీరికి శనిదేవుడి దయవల్ల అనంతమైన ధనం లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరు ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు ఈ సమయంలో పెడితే శనిదేవుడు, శుక్రుడి నుంచి మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications