300 ఏళ్ల తర్వాత అరుదైన యోగం... ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు సంచారం చేసినప్పుడు అనేక యోగాలు ఏర్పడుతుంటాయి. ఒక రాశి నుంచి మరో రాశికి మారే క్రమంలో ఏర్పడే ఈ యోగాల వల్ల రాశి చక్ర గుర్తులకు అద్భుతంగా కలిసివస్తుది. ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజు మకర రాశిలో కుజుడు, చంద్రుని కలయిక ద్వారా చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది.
ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రిని వైభవంగా జరుపుకుంటాం. మహా శివరాత్రి రోజు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు కలుస్తున్నారు. ఈ కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం 300 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

తులా రాశి
గతంలో వేరేవారికి డబ్బులిచ్చి ఇక రాదు అనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడి ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. అలాగే వారితో ఎక్కువ సమయం గడపడానికే ప్రాధాన్యతనివ్వండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శివుణ్ని దర్శించుకోవడంవల్ల మీరు అనుకున్నదాన్ని కష్టపడి సాధించుకుంటారు. అందుకు భగవంతుడు తోడ్పడతాడు.
వృషభ రాశి
లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎంతో కష్టపడతారు. పనిని సాధిస్తారు. అడ్డంకులన్నీ అధిగమిస్తారు. ప్రతి పనిలో విజయం సాధించడానికి అదృష్టం కలిసివస్తుంది. ఆనందంగా జీవిస్తారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. కలిసివచ్చే ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా స్థిరపడతారు. ఎదుటివారికి డబ్బులిచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. శివాలయాన్ని సందర్శించాలి.
మకర రాశి
300 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతోపాటు పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కష్టపడి పనిచేసినవారికి పదోన్నతి దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం తలుపుతడుతుంది. విదేశాలకు వెళ్లానుకుంటున్నవారు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలి. పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి.
మేష రాశి
ఆర్థికంగా అడ్డువస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారం పనిమీద దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. డబ్బును పొదుపు చేయడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది. శివాలయాన్ని సందర్శించడంవల్ల అడ్డంకులన్నీ అధిగమిస్తారు.












Click it and Unblock the Notifications