బుధుడు, శని కూటమి... ఈ రాశులు స్టాక్ మార్కెట్‌ద్వారా మిలియనీర్లవుతారు
గ్రహాలు రాశి సంచారం పరంగా ఫిబ్రవరి నెల అత్యంత కీలకమైన నెల. ఈ నెలలో ప్రధాన గ్రహాలన్నీ తమ రాశులను మార్చుకుంటున్నాయి. కొన్ని గ్రహాల సంయోగం జరుగుతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు, న్యాయదేవత శని సంయోగం జరగనుంది.
శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తుండగా బుధుడు కూడా వచ్చే నెల 11వ తేదీన ఇదేరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల త్రికాదశ యోగం ఏర్పడుతోంది. ఇది సంఘ జీవితంతోపాటు మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ రెండు గ్రహాలు మానవులకు చాలా అనుకూలమైన గ్రహాలు. వీటి ప్రభావంతో నాలుగు రాశుల జీవితం మారిపోనుంది.

మిథున రాశి
ఈ రాశి తొమ్మిదో ఇంట్లో బుధుడు, శని కలయిక ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.
కుంభరాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో అన్ని పనులను ఎంతో సానుకూలంగా, సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కార్యాలయంలో ఉద్యోగస్తులను పై అధికారులతోపాటు తోటి ఉద్యోగులు కూడా అభినందిస్తారు. కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి. మీరు చేసే మంచి పనులవల్ల సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పన్ను ప్రయోజనాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. పెద్దల నుంచి రావాల్సిన ఆస్తికి సంబంధించి జరుగుతున్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయాన్ని అందుకుంటారు.
మేష రాశి
ఈ రాశి 11వ ఇంట్లో ఈ కలయిక ఉండటంవల్ల ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నవారు ఈ సమయంలో ప్రయత్నాలు చేయాలి. స్టాక్ మార్కెట్ తోపాటు వాటి సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగా కలిసివస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి ఆదాయ వనరులు దొరుకుతాయి.












Click it and Unblock the Notifications