ఈ నెల 30 నుంచి ఈ రాశుల జీవితాన్ని వారు కూడా ఊహించలేరు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నాలుగు మహా శని యోగాలు సంభవిస్తున్నాయి. ఈనెల 29వ తేదీన శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేరోజు ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం సంభవించనుంది.
ఈ రెండు కాకుండా చైత్ర నవరాత్రులు కూడా 29 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. కొందరు 30వ తేదీ అంటున్నారు. ఒక్కరోజు తేడాతో తెలుగు నూతన సంవత్సరాది ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు అతి పెద్ద పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. వీటి ప్రభావం ఏయే రాశులపై ఎలా ఉంటుంది? వారికి నష్టాలు కలుగుతాయా? లాభాలు వస్తాయా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనస్సు రాశి
ప్రత్యర్థుల నుంచి ఈ సమయంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవ్వాలి. కానీ అవి పూర్తవకుండా ఇబ్బందిపెడతాయి. ఉద్యోగస్థులకు వారి కార్యాలయంలోనే వివాదాలు తలెత్తుతాయి. వాహనం నడిపే సమయంలో మాత్రం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. జీవితంలో అతి పెద్ద మార్పు చోటుచేసుకోనుంది.
మీన రాశి
వ్యాపారస్తులు డబ్బుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా అవమానాలను ఎదుర్కుంటారు. మాటతీరు సరిగా లేకపోతే గొడవలు పడే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిది. ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడే స్థైర్యాన్ని సమకూర్చుకోవాలి.
మేష రాశి
ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పెళ్ళయినవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే ఆర్థికంగా నష్టాలు వస్తాయి. కెరీర్ పరంగా కూడా ఇక్కట్లు తప్పవు. ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదానికి గురవుతారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో వాహనాలు నడపకుండా ఉండటమే ఉత్తమం.
సింహ రాశి
రుణ బాధలు ఎదురవుతాయి. అవి తీరడానికి చేతిలో డబ్బులుండవు. మనోవ్యధకు లోనవుతారు. దీంతోపాటు అప్పులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కూడా నష్టాలున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్థులు తమ ఉద్యోగంలో మార్పును చూస్తారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురవుతాయి.












Click it and Unblock the Notifications