బలపడిన సూర్యుడు.. నేటి నుంచి ఈ రాశులకు రాజయోగం
గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు 17వ తేదీన బలపడ్డాడు. కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడంవల్లే ఇలా జరిగింది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారికి మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు సూర్యుడు బలపడటంవల్ల లాభం కలుగుతుందనే వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
గతంలో ఉన్న వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదరుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకుంటుంది. ఉద్యోగస్థులకు తోటి ఉద్యోగుల వల్ల లాభాలుంటాయి. వ్యాపారస్తులకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు.

సింహరాశి
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి సత్ఫలితాలను ఇస్తాయి. మీ దినచర్యలు మెరుగుపడి ఆనందంగా ఉంటారు.
మకర రాశి
కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు భారీ ఆర్థిక లాభాలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారస్తులకు గతంలో కంటే ఇప్పుడే బాగుంటుంది. వారి జీవితం అద్భుతంగా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.
ధనస్సు రాశి
పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వీటివల్ల భారీ లాభాలను అందుకుంటారు. పోటీ పరీక్షలు రాసేవారికి బాగా కలిసివస్తుంది. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ఇతర ప్రాంతాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు.












Click it and Unblock the Notifications