రెండు రాశుల్లోకి బుధుడు... ఈ రాశులపై కాసుల వర్షంతో అఖండ ధనయోగం
గ్రహాల రాకుమారుడు బుధుడు ఎంతో అరుదుగా శనిదేవుడి సొంత రాశి అయిన కుంభ రాశి, మకర రాశుల్లోకి ప్రవేశిస్తుంటారు. బుధుడు రెండు గ్రహాల్లో సంచారం చేయడంవల్ల కొన్ని రాశులవారికి ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ప్రధానంగా మానసికంగా అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నవారు వాటినుంచి విముక్తి పొందుతారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. జాతక చక్రంలో బుధుడు శుభస్థానంలో ఉన్న ఈ రాశులవారికి తిరుగులేదు. ఏయే రాశులకు ఏవిధంగా బుధుడి సంచారంవల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారు కొంచెం శ్రమ పడినా చాలు.. మంచి ఆదాయాన్ని పొందుతారు. విదేశీ సంస్థల నుంచి వ్యాపారస్తులకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. వృత్తి జీవితం కూడా చాలా బాగా సాగుతుంది. ఆదాయం పరంగా ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతిభ ఆధారంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది.

తులా రాశి
అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మంచి లాభాలను పొందుతారు. సొంతింటి కోసం ఎప్పటినుంచో కంటున్న కలలు నెరవేరతాయి. శనిదేవుడి అనుగ్రహం కూడా ఉండటంతో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి. చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఊహించినిరీతిలో లాభాలను పొందుతారు.
మకర రాశి
శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. అన్నిరకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
మేష రాశి
వృత్తిపరమైన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి మంచి మద్దతు లభించి అనుకున్న పనులను సులువుగా పూర్తిచేస్తారు. దీనివల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలున్నాయి. కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. కోర్టు కేసుల్లో కొంతకాలం నుంచి ఇబ్బందిపడుతున్నవారికి ఈ సమయంలో వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది.












Click it and Unblock the Notifications