సంక్రాంతి నుంచి ఈ రాశులకు అద్భుతమైన రాజయోగాన్ని రాసిచ్చిన కుజుడు
నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన కుజుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి 45 రోజుల సమయాన్ని తీసుకుంటాడు. జ్యోతిష్యం ప్రకారం కుజుడి రాశి మార్పు, లేదంటే నక్షత్ర మార్పువల్ల కొన్ని రాశులవారు ప్రభావానికి లోనవుతారు. కుజుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొందరికి అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ సంచారం రాశిచక్ర గుర్తుల శక్తిని పెంచడంతోపాటు వారిని అదృష్టవంతులుగా మారుస్తుంది. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
జీవితంలో అనేక అవకాశాలు తలుపు తడతాయి. వాటిని ఎక్కువగా ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు వారి కోరిక నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనేక లాభాలను పొందుతారు. జీవితంలో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో మీరు కోరుకున్న రీతిలో ఎదగడానికి అవకాశాలు వస్తాయి. అందుకు తగ్గ సౌకర్యాలు కూడా సమకూరతాయి.

కుంభరాశి
ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి. సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న విధంగా జీవితంలో పైకి వస్తారు.
వృషభ రాశి
ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితులు కుజుడివల్ల మెరుగుపడతాయి. కష్టపడే గుణం ఉంటుంది. దీనివల్ల వారికి ప్రశంసలు అందుతాయి. తాము చేస్తున్న పనిలో అద్భుతమైన నైపుణ్యాలను చూపించడం ఈ రాశివారి సొంతం. గతంలో కలగా మిగిలిపోయినవన్నీ మీకు ఈ సమయంలో నెరవేరతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు.
సింహరాశి
ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. దీనివల్ల శక్తి పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. తమ పనిలో రాణించి పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి అన్వేషిస్తుంటారు. వారి అన్వేషణ ఫలిస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications