ఈరోజు నుంచే ఈ రాశులపై లక్ష్మీదేవి కనక వర్షం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి, ప్రేమకు, ఆనందానికి కారకుడు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ రాశులకు తిరుగుండదు. ఈనెల 31వ తేదీన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి? ఎవరికి ఎన్నివిధాలుగా కలిసిరాబోతోందనే విషయాలను తెలుసుకుందాం.
సింహరాశి
వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలన్నీ మంచి లాభాలను ఆర్జించి పెడతాయి. ఉద్యోగస్థులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.

ధనస్సు రాశి
ఆనందానికి లోటులేదు. భారీ మొత్తంలో డబ్బును పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. శుక్రుడి దయవల్ల ఊహించనిరీతిలో వీరికి ప్రయోజనాలు కలగనున్నాయి. భారీ మొత్తంలో సంపదను కూడబెడతారు.
మకర రాశి
దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బులు భారీగా సంపాదిస్తారు. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగస్థులకు వేతనాలు భారీగా పెరుగుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని పూజించడంవల్ల అనుకున్న ఫలితాలను త్వరగా పొందుతారు.
మేష రాశి
విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్థులకు వారు పనిచేసే ప్రాంతంలో ప్రశంసలు లభిస్తాయి. కొంతకాలం నుంచి కొందరితో ఉన్న విభేదాల నుంచి విముక్తి కలుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ రాశివారికి ఈ సమయం నుంచే ఆర్థిక లాభాలు కలగడం ప్రారంభమవుతాయి. ఏ పని తలపెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం అనేది చాలా ముఖ్యం.












Click it and Unblock the Notifications