రెండుసార్లు సూర్య సంచారం.. ఈ రాశులకు అదిరిపోయే ధమాకా!

గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెలలో రెండుసార్లు సంచారం చేస్తాడు. 13వ తేదీన ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి, 17వ తేదీన కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. ఇలా రెండుసార్లు సంచారం చేయడంవల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభాలు పొందే రాశులు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం సూర్య భగవానుడు ఈరోజు వరకు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో ఉంటాడు.

సింహ రాశి
ఉద్యోగస్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. అదనపు ఆదాయానికి మార్గాలు దొరికి ఆర్థికంగా బలపడతారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. సూర్యుడి సంచారం ఈ రాశివారికి ఒక వరమని చెప్పొచ్చు.

four zodiac signs will get huge money and good name in society due to sun transit two times in September month

తులా రాశి
చేపట్టే ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలగడంతోపాటు గౌరవ మర్యాదలు కలుగుతాయి. కెరీర్ పరంగా వృద్ధిలోకి వస్తారు.

కర్కాటక రాశి
విజయాలను చాలా సులువుగా సాధిస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారి జీవితం ఆనందంగా గడుస్తుంది. శుభవార్తలను వింటారు. వీరికి అన్నీ శుభ ఫలితాలే ఎదురవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు భారీగా ఉంటాయి. ఆర్థికంగా బలపడతారు. న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి విముక్తి లభిస్తుంది.

మేష రాశి
కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. సమస్యలన్నింటికీ పరిష్కారాలు దొరుకుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారులకు కలిసివచ్చే సమయం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+