అక్టోబరు నెలలో ఈ రాశుల తలరాతను మారుస్తున్న లక్ష్మీదేవి
జ్యోతిష్యం ప్రకారం అక్టోబరు నెల చాలా కీలకం. ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ సంచారం చేస్తుంటాయి. బుధుడు, అంగారకుడితోపాటు మరో రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాయి. ఈ నెలలోనే దసరా నవరాత్రులతోపాటు దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీన బుధుడు తులారాశిలో, 13వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలో, 17వ తేదీన సూర్యుడు తులారాశిలో, 20వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. రవి, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా మంచిది. ఈ నెలలోనే శనిదేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఏయే రాశులవారికి విశేష ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారికి అద్బుతమైన ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.

సింహ రాశి
వీరికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కన్య రాశి
వీరిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. పనితీరుకు ప్రశంసలు కూడా దక్కుతాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసేచోట అద్భుతమైన పనితీరును కనపరుస్తారు. ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధిస్తాడు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. మంచి ఒప్పందాలున్నాయి.
తులా రాశి
కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంది. వ్యాపారస్తులు తమ కష్టాల నుంచి బయటపడి మంచి లాభాలను ఆర్జిస్తారు. చేసే పనులకు మంచి సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. పెళ్లి కానివారికి ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లి కుదురుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనువుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications