ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశులకు అద్భుత ధనయోగం
నవగ్రహాల్లో అంగారకుడు కూడా చాలా కీలకమైన గ్రహం. ఈనెల 23వ తేదీ నుంచి కుజుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు ఇలా నక్షత్ర సంచారం చేయడంవల్ల కొన్ని రాశులావరి జీవితాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలగడంతోపాటు కుటుంబ సభ్యుల మద్దతుతో ఆర్థికంగా విజయాలను సాధిస్తారు.
సింహరాశి
ఆర్థికంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. మరింత స్థాయికి పెరుగుతుంది. కొన్ని పనులు వెంటనే పూర్తిచేసి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం కష్టపడతారు. వారితో జీవితం సంతోషంగా సాగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. సంపాదన భారీగా పెరుగుతుంది. అందుకు అదృష్టం కలిసివస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కుజుడిని కూడా పూజించడంవల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి.

తులా రాశి
ఈ రాశివారికి సమాజంలో హోదా పెరగడంతోపాటు గౌరవం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఆదాయ ఆర్జనకు అనేక మార్గాలు తోడవుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. వారికి మంచి లాభాలు రావడంతో కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. భవిష్యత్తులో ఇవి మంచి రాబడినిస్తాయి.
వృశ్చిక రాశి
అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరతాయి. దీనివల్ల సంపాదన పెరిగి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. వీరికి బాగా కలిసిరానుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసివస్తుంది. పనితీరుతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు ఆర్థికంగా లాభాలుంటాయి.
వృశ్చిక రాశి
కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసిమెలిసి ఉంటారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలు చవిచూస్తారు. కొన్ని పనులు చాలా సులభంగా పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం రెండురెట్లు ఎక్కువగా లభిస్తుంది. కుజుడి అనుగ్రహంతో ప్రశాంతంగా జీవిస్తారు.












Click it and Unblock the Notifications