వారఫలాలు: ఆగస్టు 13 నుంచి 19 వరకు రాశిఫలాలు (తుల నుంచి మీనం వరకు)
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే క్రమంలో కొందరికి సానుకూల ఫలితాలు ఎదురైతే మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి కలిసొస్తుంది? అంతా సానుకూలమేనా? ఇబ్బందులుంటాయా? ఉంటే ఎలా పరిష్కరించాలి.. తదితర విషయాలను రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. మేష రాశి నుంచి కన్యా రాశి వరకు ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
తులారాశి: ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అధికార యోగం కనపడుతోంది. చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. చేసే పనులన్నీ ఆదర్శవంతంగా ఉంటాయి. వ్యాపార యోగం బాగుంది. ఇష్టదేవతను స్మరించండి. లక్ష్మీ కటాక్ష సిద్ది ఉంది.

వృశ్చిక రాశి: పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. పొరపాటు జరిగినా అధైర్యపడొద్దు. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ ఉండాలి. తోటివారిని కలుపుకు వెళ్లాలి. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు పయనించాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
ధనుస్సు రాశి: ఎవరికీ ముక్కుసూటిగా సమాధానాలు చెప్పొద్దు. పని పూర్తవ్వాలంటే సమయస్ఫూర్తి ఉండాలి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇతరులపై అసలు ఆధారపడొద్దు. సూర్య భగవానుడిని ధ్యానించాలి.
మకర రాశి: ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మీ సంస్కారమే మిమ్మల్ని కాపాడుతుంది. చేసే ప్రతి పనిలో పురోగతి ఉంటుంది. ధర్మమార్గాన్ని వదలొద్దు. వ్యతిరేక ఫలితాలున్నప్పటికీ సంయమనాన్ని పాటించాలి. వ్యాపారంలో ఆటంకాలున్నప్పటికీ మిత్రుల సహాయంతో ముందుకు వెళుతుండాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
కుంభరాశి: కష్టపడినదాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఫలితాలు బాగున్నాయి. ఏదైనా పని తలపెట్టబోయేముందు సన్నిహితులు, ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. మీకు మేలు చేకూర్చేవారున్నారు. ఎదురుచూస్తున్న పని కూడా పూర్తవుతుంది. నవగ్రహ శ్లోకాలతోపాటు విష్ణువును స్మరించాలి.
మీనరాశి: వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. పెట్టుబడులు లాభాన్ని కలిగిస్తాయి. సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు ఎటువంటి సంకోచం ఉండకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఇష్టదైవాన్ని ధ్యానించాలి.












Click it and Unblock the Notifications