కలలో ఇవి కనిపిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం
రాత్రి నిద్రించే సమయంలో మనకు రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని రహస్యమైన కలలు జీవితాన్ని మారుస్తాయి. మరికొన్ని కలలు ఆర్థిక లాభాలను సూచిస్తాయి. జీవితంలో మనకు ఏదైనా మంచి జరగాలి లేదంటే శుభవార్త మనకందుతుంది.. అని భావించేలా కొన్ని కలలు ఉంటాయి. వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం
* కలలో పాము కనిపించినా లేదంటే పాము పుట్ట నుంచి బయటకు వస్తున్నట్లు కనపడితే జీవితంలో ఏదైనా మంచి జరగబోతుందనేదానికి సంకేతం. భవిష్యత్తులో అకస్మాత్తుగా డబ్బు వస్తుందనేదానికి ఒక సూచనగా భావించాలి.
* కలలో చెట్టు ఎక్కినట్లు కనపడితే హఠాత్తుగా డబ్బు అందుకుంటారు. ఆకస్మిక డబ్బు ధనవంతులుగా మారుస్తుంది.
* నృత్యం చేస్తున్న స్త్రీని కలలో చూడటం శుభప్రదం. భవిష్యత్తులో ఆకస్మిక చెల్లింపులుంటాయనేదానికి సంకేతం.

* కలలో తేనెటీగ గూడును చూసినా మంచిదే. అకస్మాత్తుగా డబ్బును పొందుతారు.
* కలలో ఎలుకపై గణేషుడు సవారీ చేయడం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఎల్లుకను చూడటమంటే ఇంట్లోకి డబ్బు వస్తుందనేదానికి సంకేతం.
* విడిగా కాకుండా ధరించిన ఉంగరం చూస్తే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎరువు లేదా ముత్యాల ఉంగరం కనపడటంవల్ల ప్రత్యేక ప్రయోజనాలుంటాయి.
* ఎద్దులబండి కనిపిస్తే పెద్ద తిరుగుబాటు జరగబోతోందని అర్థం.
* చీకటి మేఘాలు కనపడటం అశుభం. జీవితంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోబోతున్నారని అర్థం.
* నల్ల కాకి కనిపిస్తే అశుభం. పెద్ద ప్రమాదం జరగబోతోందని అర్థం. లేదంటే మీకు దగ్గరగా ఉండేవారి మరణవార్తను వింటారనే అర్థం.
* రక్తస్రావం కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘమైన అనారోగ్యం కలగబోతోందని అర్థం.
* ఇల్లు కూలిపోతున్నట్లు కనపడటం, తుఫాను లేదంటే సుడిగాలి లాంటిది చూసినా అశుభమే. దురదృష్టం వెంటాడబోతోందనే అర్థం.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications