దీపావళి రోజు ఈ సమయంలో లక్ష్మీదేవికి పూజచేయండి
దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి అనేది దీపాల పండుగ. ఆ రోజు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరతాయని, సంపద వర్షంలా కురుస్తుందని ప్రజలు ప్రబలంగా నమ్ముతారు. ఈ సంవత్సరం 12 నవంబర్ 2023 న దీపావళి జరుపుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడు, సరస్వతి అమ్మవారిని పూజిస్తారు.
ఈ ఏడాది మొత్తం ఆరు సమయాలున్నాయి. 500 సంవత్సరాల తర్వాత అద్భుత కలయిక జరగబోతోంది. దీపావళి మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభమై 2.32 గంటల వరకు ఉంటుంది. ఇల్లు, కార్యాలయం, దుకాణం, అఘోరి పూజలకు ఇవి చాలా శుభప్రదమైన సమయమని పండితులు తెలియజేస్తున్నారు. ఈసారి దీపావళి నాడు గజకేశరి, హర్ష, ఉభయచారి, దుర్ధర, కహల్ అనే రాజయోగాలు ఉన్నాయి. బుధుడు, చంద్రుడు, శుక్రుడు, గురు గ్రహాల ఒకే స్థానాల్లో ఈ యోగం ఏర్పడుతోంది.

దీపావళి రోజు సాయంత్రం 5.40 గంటల నుండి రాత్రి 8.16 గంటల వరకు పూజలకు ఉత్తమ సమయం. దీపావళి నాడు గృహ పూజా సమయం సాయంత్రం 5.41 గంటల నుండి రాత్రి 8.57 వరకు బాగుంది. పండగరోజు ఇల్లు, కార్యాలయంలో పూజకు అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:15 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 2:45 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీపావళి రోజు తంత్రార్థులకు పూజా సమయం మధ్యాహ్నం 12:19 నుండి మధ్యాహ్నం 2:33 గంటల వరకు ఉంటుంది.
దీపావళి అనేది హిందూ దీపాల పండుగ. వైవిధ్యాలతో ఇతర భారతీయ మతాల్లో కూడా దీన్ని జరుపుకుంటారు. ఆధ్యాత్మిక చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం గెలుపును సూచిస్తుంది.












Click it and Unblock the Notifications