చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులకు అదృష్టం, విదేశీ యానం, సంపద!

గ్రహాల సంచారం ప్రకారం సెప్టెంబరు నెల చాలా కీలకమైన నెల. గ్రహాలకు అధిపతి సూర్యుడు, ఛాయా గ్రహం కేతువు, సంపదకు కారణమయ్యే శుక్రుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు కలుస్తున్నారు. ఈ నాలుగు గ్రహాలు కలవడంవల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారికి విదేశీ ప్రయాణం ఉంది. దీంతోపాటు విజయాలు పలకరిస్తాయి. అదృష్టం తోడుంటుంది. వారికి ఏవిధంగా ఈ యోగం మంచి యోగాన్ని కల్పిస్తుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
గతంలో కంటే ఇప్పుడు ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తారు. దీనివల్ల మీపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టి విజయవంతం చేస్తారు. తల్లిదండ్రులతో ఎంతో ప్రేమగా ఉంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి పెళ్లి కుదురుతుంది.

Good luck foreign travel and wealth for these zodiac signs with Chaturgrahi Yoga

ధనుస్సు రాశి
చేస్తున్న పనిలో అదృష్టం తోడుంటుంది. డబ్బు పరంగా అనేక లాభాలు పొందుతారు. మీ మనసులో ఉన్న రకరకాల ఆలోచనలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే మీరు వ్యక్తిగతంగా కానీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శుభకార్యానికి వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీ గమ్యస్థానం చేరుకోవడానికి చతుర్గ్రాహి యోగం బాగా ఉపయోగపడుతుంది.

సింహ రాశి
ఒకరకంగా ఈ రాశివారికి చాలా సంతోషకరమైన సమయం అని చెప్పొచ్చు. ప్రజాదరణ పెరుగుతుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. పెళ్లయినవారు దాంపత్య జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. ఉద్యోగస్థులకు కెరీర్ పరంగా బాగుంది. వేతనం పెరుగుదలతోపాటు కొత్త బాధ్యతల స్వీకరణ ఉంటుంది. శుక్రుడు, సూర్యుడు కలిసి వీరికి గొప్ప అదృష్టాన్ని తెస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+