భరణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశులవారికి తిరుగులేదు
జ్యోతిష్య శాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రయాణించడానికి బృహస్పతికి 18 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 21వ తేదీన తన నక్షత్రాన్ని కూడా మార్చాడు. జూన్ 21వ తేదీన 1.19 గంటలకు భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. గురుడు ఇలా నక్షత్రాన్ని మార్చడం కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉంటుంది. వారికి అదృష్టం వెన్నంటి ఉంటుంది. ఏయే రాశులవారికి ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.
తులారాశి : గురుడి సంచారం తులారాశివారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. సొంత కంపెనీని నిర్వహించేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడటమేకాకుండా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

ధనుస్సు రాశి : నక్షత్ర మార్పు అనేది ధనుస్సు రాశివారికి బాగా కలిసి రానుంది. ఈ సమయంలో వారు ఏ పని చేపట్టినా దాన్ని పూర్తిగా సక్సెస్ చేస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతికి సంబంధించిన శుభవార్తలను వింటారు. తద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరణ బాట పట్టిస్తారు.
మకరరాశి : గురుడు నక్షత్రాన్ని మార్చడం మకర రాశివారికి సానుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. విద్యారంగంలో ఉన్న వ్యక్తులు శుభ ఫలితాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్లకు సంబంధించిన శుభవార్తలను వింటారు. వీరు తమ పై అధికారులను పనితీరుతో మెప్పించి ప్రశంసలందుకుంటారు.
మేషం : కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ధన లాభం ఉంటుంది.
సింహం : సింహ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉండటంతోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.












Click it and Unblock the Notifications