గురు పౌర్ణమి నాడు ఏం చెయ్యాలో తెలుసుకోండి
గురువులను ఆరాధించటానికి చాలా ప్రత్యేకంగా, పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురుపూర్ణిమ. గురు పూర్ణిమ రోజున గురువులను పూజించడం, దానధర్మాలను చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అసలు ఈ సంవత్సరం గురుపూర్ణిమ ఎప్పుడొస్తుంది? గురు పూర్ణిమ రోజు చేయవలసిందేమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
గురు పూర్ణిమ జరుపుకునేది ఇందుకే
ప్రతి సంవత్సరం గురుపూర్ణిమ పండుగను ఆషాడమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం. గురుపూర్ణిమనే ఆషాడ పూర్ణిమ అని కూడా అంటారు. వేద వ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంధాన్ని రచించిన వేదవ్యాసుడుని గొప్ప గురువుగా భావించి గురుపూర్ణిమను జరుపుకుంటాము.

గురు పూర్ణిమ ఎప్పుడు
ఈ సంవత్సరం గురు పూర్ణిమ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. గురుపూర్ణిమను 20వ తేదీన జరుపుకోవాలా లేదా 21వ తేదీన జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పంచాంగం ప్రకారం ఆషాడమాసంలో పౌర్ణమి తిధి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ సాయంత్రం మూడు గంటల 45 నిమిషాలకు ముగుస్తుంది.
గురు పూర్ణిమకు దాన ధర్మాలు చేస్తే మంచిది
అయితే పౌర్ణమి తిధిని జరుపుకోవడానికి చంద్రోదయ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి జులై 20వ తేదీన గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. జులై 20వ తేదీ రాత్రి గురుపౌర్ణమి పర్వదినాన్ని జరుపుకొని, జులై 21న దానధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని, సుఖసంతోషాలు వస్తాయని చెబుతున్నారు. భగవంతుడిని పూజించటంతో పాటు దానధర్మాలకు హిందూ ధర్మంలో స్థానం ఉంది.
గురు పూర్ణిమ పూజలు, దానాలతో ఫలితం ఇలా
గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శ్రీమహావిష్ణువుని ధ్యానం చేసి, విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో, ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని, వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. గురు పూర్ణిమనాడు దానధర్మాలు చేయడం వల్ల కెరీర్లో పురోగతి వస్తుందని, ఎవరైతే గురుపూర్ణిమ రోజు దానధర్మాలు చేస్తారో..వారికి అన్ని పనులలోను విజయం లభిస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications