కార్తీక మాసంలో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం
కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, దైవానుగ్రహానికి అత్యంత పవిత్రమైన సమయం. ఈ పవిత్ర మాసంలో పరమశివుడి కృపాకటాక్షాలతో పాటు గ్రహాల అనుకూల సంచారం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చబోతోంది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు జరిగే ఈ కార్తీక మాసంలో దేవగురు గురుడు, శుక్రుడు, బుధుడు, కుజుడి శుభ స్థానాల ప్రభావం వల్ల ఆరు రాశుల వారికి విపరీతమైన రాజయోగాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి
పంచమంలో గురుడు, సప్తమంలో శుక్ర-బుధుల సంచారం మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని రీతిలో లాభాలు అందుతాయి. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి
రాశ్యాధిపతి బుధుడు శుక్రుడితో జతకట్టడం, తృతీయంలో గురు-కుజుల కలయిక వల్ల మిథున రాశి వారికి లక్ష్మీకటాక్షం లభిస్తుంది. ఊహించని రీతిలో ఆదాయం పెరగడమే కాకుండా పాత ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జిత ఆస్తులు కలసిరావడం, విదేశాల నుంచి ఆదాయం పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
ధన స్థానంలో గురు-కుజ యుతి, చతుర్థంలో శుక్ర-బుధుల కలయిక కర్కాటక రాశి వారి సంపదను విపరీతంగా పెంచుతుంది. రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్‌లో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ సమయంలో క్రమం తప్పకుండా పరమేశ్వరునికి అభిషేకం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు అందుతాయి.
తులా రాశి
స్వక్షేత్రంలో శుక్ర-బుధుల పయనం, లాభ స్థానంలో గురు-కుజ యుతి కారణంగా తులా రాశి వారికి పట్టందల్లా బంగారంగా మారబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు లక్ష్మీ, కుబేర యోగాలు కలిసివస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడం లేదా ప్రేమ బంధం బలపడటం జరుగుతుంది.
ధనుస్సు రాశి
లాభ స్థానంలో లాభాధిపతుల సంచారం, భాగ్య స్థానంలో గురు-కుజులు ఉండటం వల్ల ధనుస్సు రాశి వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి.
కుంభ రాశి
భాగ్య స్థానంలో శుక్ర-బుధులు, సప్తమంలో గురుడి ప్రభావం వల్ల కుంభ రాశి వారికి ఏలినాటి శని తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు తొలగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సంతాన నిరీక్షణలో ఉన్నవారికి శుభవార్తలు అందడంతో పాటు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఆరు రాశుల వారు కార్తీక మాసంలో శివారాధన చేయడం, పాత మొక్కుబడులు చెల్లించుకోవడం వల్ల అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి.














Click it and Unblock the Notifications
