today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం, ఏకాదశి తిథి, మధ్యాహ్నం 2.15 వరకు ధనిష్ట నక్షత్రం, తర్వాత శతభిష నక్షత్రం, ఉదయం 07:30 నుండి 09:00 వరకు వరకు రాహుకాలం, రాత్రి 08:45 నుండి 10:20 వరకు వర్జ్యం ఉంది.
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఏరోజుకు ఆరోజు రాశుల ఫలితాలను గ్రహాలు నిర్దేశిస్తుంటాయి. ఒక్కరోజే కదా ఏముందిలే అని కొట్టిపారవేయడానికి వీల్లేని విధంగా ఒక్కోసారి అద్భుత ఫలితాలుంటాయి. ఈనెల 13వ తేదీన అన్ని ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం.

మేష రాశి
ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. స్నేహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం.
వృషభ రాశి
వ్యాపార రంగంలోని వారికి లాభాలు చేకూరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి, కానీ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
మిథున రాశి
ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి
వృత్తిరీత్యా బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటించడం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. దైవ ప్రార్థన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహ రాశి
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత వస్తుంది. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కన్యారాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బదిలీలు లేదా ప్రమోషన్ల సూచనలు ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
తులారాశి
పిల్లల ప్రగతి పట్ల సంతృప్తిగా ఉంటారు. సృజనాత్మక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి.
వృశ్చిక రాశి
ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. వృత్తిలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సమయానుకూలంగా భోజనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం వరిస్తుంది.
మకర రాశి
ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నోటి దురుసు వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిగ్రహం పాటించండి. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు.
కుంభ రాశి
ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీన రాశి
అధిక ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికీ హామీగా ఉండవద్దు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
-
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!











Click it and Unblock the Notifications