కుంభరాశి, మీనరాశి మే నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. కుంభరాశి, మీన రాశివారి గ్రహ గతులు, నక్షత్ర సంచారం ఆధారంగా వారికి మే నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే మీ వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశల బట్టి ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. మే నెలలో మీ రాశ్యాధిపతి శని మీన రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక, కుటుంబ విషయాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ, దానికి సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఒత్తిడి ఉంటుంది కానీ పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులతో అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు నెల ద్వితీయార్థంలో శుభవార్తలు అందుతాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయండి. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వస్తాయి కానీ పెద్దల జోక్యంతో సమస్యలు పరిష్కారమవుతాయి. శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది.

మీన రాశి
మీన రాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని మధ్య దశలో ఉన్నారు. మే నెల వీరి సహనానికి ఒక పరీక్షగా ఉంటుంది. జూన్ నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఊహించని ఖర్చులు రావచ్చు. వైద్యం లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త అప్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. వాటికి దూరంగా ఉండండి. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరుపై పై అధికారుల నిఘా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. నిద్రలేమి సమస్య వేధించవచ్చు, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాణాయమం, ధ్యానం చేయండి. పిల్లల చదువుల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. దాంపత్య జీవితంలో ఓపికగా ఉండటం వల్ల ప్రశాంతంగా జీవిస్తారు. పేదలకు అన్నదానం చేయడం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం శుభ ఫలితాలు కలుగుతాయి. రాత్రి ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించండి.
-
శుక్రాదిత్య రాజయోగం త్వరలో.. ఈ రాశులవారికి లగ్జరీలు! -
ధనుస్సు రాశి, మకర రాశి మే నెల జాతక ఫలం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
తులారాశి, వృశ్చిక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంప్దదల ఖజానా సిద్ధం చేసిన ముఖ్య గ్రహాలు! -
ఏప్రిల్ 18న కుజుడి ఉదయంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులవుతారు -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ












Click it and Unblock the Notifications