జన్మ నక్షత్రం అనూరాధ, జ్యేష్ఠ ఉన్నవారి మే నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి. ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.మే 16న శని జయంతి ఉంది. వృశ్చిక రాశిలో ఉన్న అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ రోజు ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది.

Horoscope Predictions for Individuals Born Under the Anuradha and Jyeshtha Nakshatras for may month

అనూరాధ నక్షత్రం

అనూరాధ నక్షత్రానికి శని అధిపతి. మే నెలలో మీకు స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఆందోళన అవసరం లేదు. మే నెలలో మీ పనుల పట్ల మంచి స్పష్టత ఉంటుంది. ఆఫీసులో మీ క్రమశిక్షణకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆదాయం నిలకడగా ఉంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. విలాసాల కోసం అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది.

బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో చిన్నపాటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలగవచ్చు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. శనివారం రోజు శని దేవుడికి లేదా హనుమంతుడికి దీపం వెలిగించండి.

జ్యేష్ఠ నక్షత్రం

జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి. మే నెలలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది. పనిలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మౌనంగా ఉంటే మంచిది. రాజకీయ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ఓర్పుగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు ఆలస్యం కావచ్చు. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే నష్టపోతారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.

ముఖ్యంగా తండ్రి లేదా పెద్దవారితో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. సరైన ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+