జన్మ నక్షత్రం స్వాతి, విశాఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.
ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

స్వాతి నక్షత్రం (తులా రాశి)
స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. మే నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి గొడవలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సంతకం చేసే ముందు పత్రాలను క్షుణ్ణంగా చదవడం చాలా ముఖ్యం. ఆదాయం బాగుంటుంది కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనొద్దు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు మాత్రమే పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టొచ్చు. ఆహార నియమాలు పాటించడం, యోగా చేయడం వల్ల మేలు జరుగుతుంది. శనివారం రోజు దుర్గా దేవిని పూజించడం లేదా 'రాహు అష్టోత్తరం' పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.
విశాఖ నక్షత్రం (తులా రాశి 1, 2, 3 పాదాలు & వృశ్చిక రాశి 4వ పాదం)
విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. ఈ నెలలో మీకు అదృష్టం తోడవుతుంది. మీరు చేసే ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా బదిలీ కోసం చూస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంటుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. శుభకార్యాల వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది.
తోబుట్టువుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. మీ సలహాలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్న 4వ పాదం వారికి చిన్నపాటి వెన్నునొప్పి లేదా కండరాల సమస్యలు రావచ్చు. ప్రతి గురువారం దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు పసుపు రంగు పూలతో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications