వాస్తు ప్రకారం మీరు ఉంటున్న ఇల్లు ఎత్తుపల్లాల్లున్న స్థలంలోనా? చదునుగా ఉన్న స్థలంలోనా?
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకునే సమయంలో దాదాపుగా అందరూ చదును చేసి కట్టుకుంటారు. ఎత్తుపల్లాలున్న స్థలంలో ఎవరూ కట్టరు. కొందరు ధనవంతులు మాత్రం రాళ్లు అడ్డంగా ఉన్నాయని వాటిని కూడా ఇంట్లో భాగంగా ఉంచేసుకుంటారు. మరికొందరు కొండరాళ్లను తొలిచి కట్టుకోవడంవల్ల కొన్ని కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు వస్తుంటాయి. ఆకారం కూడా సరిగా రాదు. వాస్తు ప్రకారం అలా ఉంటే ఏంటనే వివరాలను తెలుసుకుందాం.
ఎత్తు ఉంటే అది ఏ దిక్కులో ఎత్తుగా ఉంటుందో చూసుకోవాలి.
అలాగే ఎత్తు తక్కువగా ఉంటే అది కూడా ఏ దిశలో ఉందో చూసుకోవాలి.
స్థలం కొనుగోలు సమయంలోనే ఇవన్నీ చూసుకోవాలి.
ఎత్తుపల్లాలుగా ఉన్న ఇంటికి రోడ్డు ఎటువైపు ఉందో చూసుకోవాలి.
పడమర వైపు ఎత్తు ఉండాలి. అలాగే దక్షిణం వైపు కూడా ఉండొచ్చు.
తూర్పు వైపు, ఉత్తరం వైపు ఎత్తు తక్కువగా ఉంటే పర్వాలేదు.

అన్నింటికంటే పల్లంగా ఈశాన్యం ఉండాలి.
ఇక్కడ నీరు నిల్వ ఉంటే చాలా మంచిది.
తూర్పువైపు పల్లం ఉంటే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
ఉత్తరం వైపు పల్లం ఉంటే ఆర్థికంగా కలిసివస్తుంది.
ఇంటి మొత్తానికి ఎత్తుగా ఉండాల్సిన దిక్కు నైరుతి.
దీనివల్ల యజమానికి ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది.
సమాజంలో గౌరవం పెరుగుతుంది.
దక్షిణ దిక్కులో ఎత్తు తక్కువగా ఉండాలి.
ఇది యముడికి సంబంధించిన స్థానం కాబట్టి ఆయుష్షు పెరుగుతుంది.
పడమర దిశ తూర్పు కంటే ఎత్తుగా ఉండాలి.
నైరుతిలో పల్లం ఉంటే అకాల మరణాలుంటాయి.
దీర్ఘకాలిక అనారోగ్యాలు కలుగుతాయి.
ఈశాన్యంలో ఎత్తు ఉంటే పిల్లలు పుట్టరు. మానసిక సమస్యలు వస్తాయి.
దక్షిణంలో ఎత్తు ఉంటే స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటుంది.
నైరుతిలో పల్లం ఉంటే మట్టితో పూడ్చాలి.
మిగిలిన ఇంటికంటే ఎత్తుగా ఉంచాలి.
నైరుతి ఎత్తు పెంచడానికి డాబా మీద మంచినీటి ట్యాంకు కట్టుకోవడం ఉత్తమం.
నైరుతి దిశలో బరువులు ఉంచడంవల్ల మంచి ఫలితం వస్తుంది.
లోపల గదులు ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి.
గడపల వద్ద ఎత్తుపల్లాలు ఉండకూడదు.
నేల ఎప్పుడూ సమానంగా ఉండాలి.












Click it and Unblock the Notifications