Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్కాటకరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

పునర్వసు నక్షత్ర 4 వ పాదాల వారు, పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములవారు, ఆశ్లేష నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుదురు.

 How will this Ugadi year be for th How will this Ugadi year be for the people who hold Cancer as Zodiac sign 	e people who hold Cancer as Zodiac sign

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటకరాశి వారికి

ఆదాయం 14, వ్యయం - 02,

రాజ పూజ్యం - 06, అవమానం - 06

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు అష్టమ స్థానమైన ( కుంభం) లో తామ్రమూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు సప్తమంలో రజితమూర్తి.. ఆ తర్వాత సంవత్సరం అంతా అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... సప్తమ స్థానమైన ( మకరరాశి )లో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 11 , 5 ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

గురువు ఉగాది నుండి ఆశుభుడు కాబట్టి సంవత్సరమంతా అనుకూల ఫలితాలను ఇవ్వడు.

గత శార్వరి నామ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వలన కొన్ని ఇబ్బందులతో కొనసాగును.

ముఖ్యంగా గురువు నవంబర్ 20 నుంచి తీవ్రమైన ఆర్ధిక సమస్యలు కలుగజేయును .

 How will this Ugadi year be for th How will this Ugadi year be for the people who hold Cancer as Zodiac sign 	e people who hold Cancer as Zodiac sign

స్వార్జితం మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ ఖర్చు అవుతాయి .

వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్రలో కానీ లేదా శత్రు స్థానాలలో ఉంటే గురువుకు అభిషేకాలు, శాంతి జపములు చేయించాలి.

* శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును.

కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలలో విజయం పొందుతారు .

జాతకంలో శని వలన కళత్ర దోషం ఏర్పడిన వారు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు.

విశేషించి అనారోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్య పరమైన విషయాలలో ఎంత మాత్రం అశ్రద్ద పనికిరాదు.

* రాహువు - కేతువులు ఇద్దరూ అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తారు .

ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధన లాభం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును.

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి విజయం ఏర్పరచును.

సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

వృత్తి వ్యాపారాలలో కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

* అవివాహితులకు వివాహ యోగం.

సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును.

వ్యక్తిగత జాతకాల ఆధారంగా భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయాలలో దూరం అవడం కానీ లేదా విడిపోవడం కానీ శాశ్వతంగా దూరం అవ్వడం కాని జరిగే ఆస్కారం ఉంది. ( ఇది అందరికీ వర్తించదు. )

రాజకీయ రంగాలలో రానిస్తారు. కానీ సెప్టెంబర్ వరకు స్వంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తాయి.

జీవితంలో కొంత మంది దూరం అవుతారు.

వ్యాపారం పరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారు.

కుటుంబంలో అందరితో కలిసి ఉన్ననూ .. మీరు ఒంటరివారేనన్న భావన కల్గుతుంది .

విద్యాకు సంబందించి విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

ఈతలకు ( స్విమ్మింగ్ ) లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

వ్యవసాయ దారులకు మొదటి పంట అనుకూలంగా వస్తుంది. రెండవ పంట ఆశించినంత రాకపోవచ్చును.

ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు ఉంటాయి.

తోటి ఉద్యోగులతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి.

పై అధికారులతో సఖ్యత ఉండదు.

అవకాశం చేసుకుని చండీ హోమం జరిపించుకోవడం మంచిది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని ఆరాధన, మరియు హోమ కార్యక్రమం జరిపించుకుంటే మంచి జరుగుతుంది.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+