Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేషరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సర 2021-2022 ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

How will this Ugadi year be for the people who hold Aries as Zodiac sign

మేషరాశి:- అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు, భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ, వ్యయాలు

ఆదాయం - 08, వ్యయం - 14 ,

రాజపూజ్యం - 04 అవమానం - 03.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి లాభస్థానమైన ( కుంభం) లో నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. నవంబర్ తర్వాత లోహమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా ... దశమ స్థానం ( మకరరాశి )లో తామ్రమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 2 , 8 ( వృషభ, వృశ్చిక ) రాశులలో లోహమూర్తులుగా ఉంటారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తారు .

వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు.

కుటుంబంలో శుభకార్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఏర్పరచును.

How will this Ugadi year be for the people who hold Aries as Zodiac sign

ముఖ్యంగా పితృవర్గంలోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పడే పరిస్థితి గోచరిస్తున్నది.

వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రంలో ఉన్నవారు గురు గ్రహ శాంతి, జపము జరిపించుకొనుట మంచిది.

* 20 - నవంబర్ -2021 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

న్యాయమైన ధన సంపాదన కలిగించును.

జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.

* శని సంవత్సరం అంతా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

ఆశించిన విధంగా ధన సంపాదన కలుగజేస్తాడు.

నల్లని వస్తువులు,

నల్లని ధాన్యములు,

లోహములకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి మంచి లాభములు కలుగజేయును.

నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును.

సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగచేయును.

రాహువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు.

* కేతువు అశుభత్వం వలన అనేక సమస్యలు ఏర్పడును.

శారీరక సౌఖ్యం తక్కువ అగును.

ప్రతి పనికి ఎక్కువగా శ్రమింప జేస్తాడు.

ఎవరి వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు ఉన్నవారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచనలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు.

దైవోపాసన చేయలనుకునే వారికి అనేక విఘ్నములు ఏర్పడుతాయి.

కొన్నివిషయాలలో మీ ప్రమేయమేమి లేకుండానే అపవాదులు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.

వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది.

ప్రేమ వ్యవహారం పట్ల నమ్మకం పోతుంది.

అవివాహితులకు వివాహయోగం కల్గుతుంది.

సంతానప్రాప్తి. ( దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )

ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.

స్వార్ధ పరులు, ఆవకాశవాదులు మీ దరిచేరుతారు జాగ్రత్తలు వహించవలెను.

స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

వాహన యోగం,

గృహ యోగం.

రాజకీయ రంగాలవారికి పదవియోగం.

స్త్రీలతో విరోధం.

అంతర్గత రాజకీయాలు పెరుగుతాయి.

ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తిచేస్తారు.

వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతులు కల్గుతాయి.

నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది.

విద్యార్ధులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యే అవకాశాలున్నాయి .

సినిమా, టీవి, రంగాల వారికి కలిసి వస్తుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, గణపతికి గరిక పూజ చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+