Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మకరరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించిన వారు మకరరాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి

All you need to know about Capricorn.

ఆదాయం - 14, వ్యయం - 14,

రాజ పూజ్యం - 03, అవమానం - 01

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు ద్వితీయరాశి ( కుంభం) లో సువర్ణ మూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు జన్మమంలో సువర్ణ మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరమంతా రెండవ ఇంట్లో రజిత మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... జన్మ స్థానం ( మకరరాశి )లో సువర్ణ మూర్తి గా ఉంటాడు.

* మీకు ఏలినాటి శని ద్వితీయ పర్యాయం నడుస్తుంది, ఇది 29 మార్చి 2025 వరకు ఉంటుంది.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 5 , 11 రాశులైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో సువర్ణమూర్తులుగా ఉంటారు.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ఆరోగ్యపరమైన చికాకులను, కుటుంబ సమస్యలు గోచరిస్తున్నాయి.

మీరు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు.

గురువు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.

గురువు ఉగాది నుండి నవంబర్ 19 వరకు అశుభుడు కాబట్టి ప్రతికూల ఫలితాలను ఇస్తాడు,

నవంబర్ 20 నుండి గురువు శుభుడు అన్ని అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

మీరు ఆశించిన విధంగా ధనవృద్ది ఉంటుంది.

సంతాన లేమి ఉన్నవారికి ఈ నవంబర్ నుండి సంతాన ప్రయత్నాలలో కూడా సఫలత లభిస్తుంది.

శని తనుస్థానంలో స్వక్షేత్రంలో ఉండుట వలన వ్యక్తిగత జాతకంలో శని దోషం ఉన్న మకరరాశి వారికి ఈ ప్లవ నామ సంవత్సరంలో అన్ని ఊహించని సంఘటనలు ఎదురౌతాయి.

చేసే ప్రయత్నాలలో నిరాశాపరచును.

మానసికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొందురు.

వృధాగా ధనం వ్యయం అగును.

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

మీలో కొంత మొండి స్వభావం దొరణి ఉండడంవలన మంచి మిత్రులను దూరం చేసుకునే సూచనలు అధికంగా ఉన్నవి.

చర్మ సంబంధమైన వ్యాధులు వలన బాధలు ఎదుర్కొందురు.

* రాహు - కేతువులు ఇరువురి వలన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఏర్పడవు.

జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఎదిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* కొంత కష్టమో, నష్టమో జీవితాశాయాన్ని సాధిస్తారు.

కుటుంబ కలహాలు,

కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలు మీతో కలవకపోవచ్చును.

మొత్తానికి ఇష్టమైన ఉద్యోగమో లేదా పదవో పొందుతారు.

రాజకీయ రంగానికి చెందినవారు ఆకస్మిక ప్రజాదరణ పొందుతారు, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పదవీ యోగం ఉంది.

అనుకోని అవకశం కలిసి వస్తుంది. సత్కారాలు, సన్మానాలు కలుగుతాయి.

వివాహ ప్రయత్నం చేసుకునేవారికి మంచి సంబంధం కుదురుతుంది'

సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి.

కొన్ని అంతరంగిక విషయాలు, రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి.

కుటుంబంలోని పెద్దలు లేదా తలిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం అని గ్రహించిండి.

వ్యవసాయ దారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభసాటిగా ఉంటాయి .

ఈతలకు ( స్విమ్మింగ్ ) దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

విదేశీ సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి.

విద్యార్ధులకు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలతలు ,

అధికారులతో మన్ననలు పొందుతారు.

అందరి కంటే కొంత ప్రత్యేకంగా నిలుస్తారు.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, గోమాతకు తృప్తి కలిగేలా వాటి ఇష్టమైన గ్రాసం పెట్టి పూజ చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+