Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీనరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి

ఆదాయం 11, వ్యయం - 05,

రాజ పూజ్యం - 02, అవమానం - 04

All you need to know about Pisces.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు వ్యయరాశి ( కుంభం) లో సువర్ణ మూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు లాభంలో రజిత మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా పన్నెండో ఇంట్లో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... లాభ స్థానమైన ( మకరరాశి )లో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 3, 9 రాశులైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి వృత్తి పరమైన విషయాలలో విజయాన్ని సూచిస్తున్నాయి.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఉగాది నుండి గురువు లాభస్థానం వలన నవంబర్ 19 వరకు ప్రతీ వ్యవహారంలో అవలీలగా నెరవేరుతాయి.

మంచి మిత్రులు పరిచయం అవుతారు.

ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

నవంబర్ 20 నుండి మీ చేతుల మీదుగా ధర్మకార్య సంబంధమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఎన్నేళ్లుగానో కలగంటున్న విహార యాత్రలను ఎట్టకేలకు ఈ సంవత్సరం చేస్తారు.

శని ( శుభత్వం ) వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను పొందుతారు.

ఆర్ధిక పరంగా విశేష యోగిస్తుంది.

* రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు, సంతోషములు ఏర్పడును.

రాహు కేతువులు అన్ని వర్గాల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును.

( వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.)

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* రాజకీయ సంబంధమైన జీవితం బాగుంటుంది.

ప్రేమ వివాహాలకు సంబంధించి విషయంలో మీరు ఓ ... కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఒడి దుడుకులు ఉంటాయి.

మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు.

పెళ్లి కావలసిన వారికి .. సంవత్సర ద్వితీయార్ధం అక్టోబర్ లో వివాహాది శుభకార్యాలు ముడిపడుతాయి.

ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభించును.

అవసారాలకు ధనం ఎదో రూపంలో మీ దగ్గరకు వస్తుంది.

గృహ నిర్మాణం చేస్తారు,

సంఘంలో గౌరవ మర్యాదలు పొందుదురు.

నవంబర్ నుండి ఇంట్లో కొన్ని అవాంతరాలు చోటు చేసుకుంటాయి.

సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి.

ఉద్యోగ మార్పు సూచనలున్నాయి.

పొత్తులతో చేసే జాయింట్ వ్యాపారాలలో అవక తవకలు ఏర్పడతాయి.

వ్యవసాయ రంగంలో రెండు పంటలు అనుకూలం

వ్యాపారులకు వ్యవహారం సామాన్యంగా కనబడినా.. లాభాలు గటిస్తారు

రాజకీయ వర్గాల వారికి అనుకూలం

విధ్యార్ధులకు అనుకూలం

ఉద్యోగులకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి.

సినిమా, టీవి రంగం వారికి అనుకూలం.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు పక్ష్యాదులకు దానా, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+