శరీరంపై ఈ భాగాలలో బల్లి పడితే ఐశ్వర్యం, అదృష్టం!!
ఇంట్లో గోడలు, ఇంటి పై కప్పులపై ఉండే బల్లులు అప్పుడప్పుడు మన శరీరం పై పడుతూ ఉంటాయి. బల్లి శరీరంపై పడితే శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. సహజంగా శకున శాస్త్రంలో బల్లి శరీర భాగాలపై పడితే అశుభమని భావిస్తారు. కానీ శరీరంలో ఏ భాగం పై బల్లి పడితే శుభప్రదంగా పరిగణించబడుతుంది.
బల్లి పడటం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బల్లి కుడి భుజం పై పడితే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చని, అనుకున్న పనులు అవుతాయని చెప్తున్నారు. అదే సమయంలో డబ్బు చేతికి వస్తుందని, ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

బల్లి ముఖం పై పడితే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారని చెబుతున్నారు. బల్లి ముఖం మీద పడటం భోజన తృప్తిని కలిగిస్తుందని చెప్తున్నారు. బల్లి మెడ మీద పడితే శకున శాస్త్రంలో ఇది గౌరవాన్ని పెంచుతుందని చెబుతున్నారు. బల్లి ముక్కు పై పడితే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.
కుడి చెవి పై బల్లి పడితే ఆభరణాలు లభిస్తాయని, ఎడమ చెవి పై పడితే ఆయురారోగ్యాలు ఉంటాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నుదుటిపై ఎడమవైపు బల్లి పడితే భవిష్యత్తులో వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
బల్లి కుడి పాదం మీద పడితే ప్రయాణాలు చేయవచ్చని, కుడి పాదం యొక్క అరికాలు బల్లి తాకడం వల్ల సంపద పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.మొత్తంగా బల్లి మీద పెడితే దురదృష్టమే కాదు, పైన పేర్కొన్న కొన్ని శరీర భాగాలపై పడితే అదృష్టం కూడా కలిసి వస్తుందని, ఐశ్వర్యం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే బల్లి పడితే ప్రతీది చెడే అని భావించకుండా ఏ శరీర భాగంపై పడితే ఏం జరుగుతుందో శకున శాస్త్రం ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications