జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఆర్ధిక, శారీరక సమస్యలు పక్కా.. మీకు తెలుసా!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడు లగ్జరీలకు అధిపతి. విలాసాలను, భౌతిక సుఖాలను ఇచ్చే శుక్రుడు తులా రాశి, వృషభ రాశినీ పాలిస్తాడు. శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే ఆర్థికంగా బలంగా ఉంటాం. అంతేకాదు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం.
జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సమస్యలివే
అదే శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బలహీన స్థితిలో ఉంటే ఏ విధంగా గుర్తించాలి. ఏ ఏ లక్షణాలతో జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడని తెలుసుకోవాలి అంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయినా శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే వారు విపరీతమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఏ పని చేయాలన్నా ముందు భయం వాళ్ళను వెంటాడుతుంది.

శుక్రుడు బలహీనంగా ఉంటే వచ్చే రోగాలివే
జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. ఆరోగ్యం పాడైపోతుంది. శుక్రుడు బలహీనంగా జాతకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ప్రేమ విషయంలో మోసపోతారు. ఒకవేళ వివాహం జరిగి ఉంటే వారికి దాంపత్య సుఖం ఉండదు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే చర్మానికి, కళ్ళకు, పాదాలకు, కడుపుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బలహీన శుక్రుడి కారణంగా ప్రతీ పనికి ఆటంకం
జీవితంలో అనేక సమస్యలు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనిషిని ఇబ్బందుల పాలు చేస్తాయి. జన్మరాశిలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఏ పని చేసినా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రుడి సహజ సంకేతాలైన ప్రేమ, ప్రశాంతత, స్వచ్ఛత, ఆనందం, వివాహం, జీవన సుఖం, శృంగార సంబంధాలు, సంపద ఇలా ప్రతి ఒక్కదానికి ఆటంకం ఏర్పడుతుంది.
శుక్రుడిని బలోపేతం చేసే పరిహారాలున్నాయ్
శుక్రుడు బలహీనంగా ఉన్న వారిలో తక్కువ సృజనాత్మకత ఉంటుంది. వారిలో తక్కువ ఆధ్యాత్మికత ఉంటుంది. బలహీన శుక్రుడి కారణంగా చేసే పని పట్ల శ్రద్ధ తగ్గుతుంది. ఇక బలహీనంగా ఉన్న శుక్రుడిని బలోపేతం చేయడానికి కూడా అనేక జ్యోతిష్య శాస్త్ర పరిహారాలు ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications